Pahalgam Terror Attack: ఉగ్రవాది హషిమ్ మూసా అప్‌డేట్ ఇదే.. దర్యాప్తులో ఏం తేలిందంటే..!
- ఉగ్రవాది హషిమ్ మూసా అప్‌డేట్ ఇదే
- దర్యాప్తులో ఏం తేలిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టింది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. అంతేకాకుండా స్థానిక వీడియోగ్రాఫర్స్ నుంచి వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియోల్లో ఉగ్రవాదుల కాల్పుల దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. వీడియోల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Heartbreaking incident in AP: పోషించలేక చిన్నారిని వదిలివెళ్లిన తల్లి.. హృదయాన్ని కదిలిస్తోన్న లెటర్..!
Also Read
ఇక ఉగ్రవాదుల్లో ఒకరైన హషిమ్ మూసా గురించి కీలక సమాచారాన్ని దర్యాప్తు సంస్థ సేకరించింది. హషిమ్ మూసా పాక్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండోలో పని చేసినట్లుగా గుర్తించింది. ప్రస్తుతం అతడు కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారిపోయినట్లు దర్యాప్తు బృందాలు తేల్చాయి. లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లుగా కనిపెట్టింది. భారీ స్కెచ్‌లో భాగంగా పహల్గామ్‌ను ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి. ఇక గతంలో కాశ్మీర్‌లో జరిగిన మూడు ఉగ్ర దాడుల్లో కూడా హషిమ్ మూసా పాత్ర ఉన్నట్లుగా తేల్చాయి.
ఉగ్రవాదులకు స్థానికులు సహకరిస్తున్నారన్న అనుమానంతో వందల మంది స్థానికులను అధికారులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. వీరిలో 15 మంది ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్స్‌గా గుర్తించారు. వీళ్లను విచారించాక.. మూసాకు పాక్ సైన్యంతో సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు ధృవీకరించారు.
ఇది కూడా చదవండి: AP BJP: అమరావతి పర్యటనకు ప్రధాని మోడీ.. ఏపీ బీజేపీ స్పెషల్ ఫోకస్..!
పాకిస్థాన్ పారా కమాండోలు అత్యాధునిక శిక్షణ పొందుతున్నారు. వీరు సంప్రదాయేతర యుద్ధతంత్రం, కోవర్ట్ ఆపరేషన్లలో దిట్టలు. శిక్షణలో వీరిని మానసికంగా.. శారీరకంగా బలోపేతం చేస్తుంటారు. అంతేకాకుండా యుద్ధరంగంలో ఎత్తుగడలు కూడా నేర్పిస్తారు. వీరు అత్యాధునిక ఆయుధాల వినియోగించడం, నేరుగా చేతులతో పోరాడటంలోను నిపుణులు. పహల్గామ్ ఉగ్ర దాడిలో పాల్గొన్న నిందితులు.. గతంలో గగన్‌నగర్, గదర్‌బాల్ అడవుల్లో ఆరుగురు స్థానికేతరులు, ఒక డాక్టర్‌ను, ఇద్దరు సైనిక పోర్టర్లను హత్య చేసిన ఘటనల్లో పాల్గొన్నట్లుగా అధికారులు గుర్తించారు. మూసా కూడా ఈ మూడు దాడుల్లోను పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
ఇక ఉగ్రవాదులు పహల్గామ్‌కు చేరుకునేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ప్రణాళికను అమలు చేసేందుకు కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు కాలి నడకన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కూడా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేటాడుతున్నాయి. ఇక పహల్గామ్ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Vijay Devarakonda : కింగ్‌డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ డేట్ ఫిక్స్
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు