Haryana IAS officer Ashok Khemka Writes A Letter To CM Seeks Vigilance Department Posting: రోజుకు 8 నిమిషాలు మాత్రమే పని.. అంతకుమించి కష్టపడాల్సిన అవసరమే లేదు. ఆ చిన్న పనికి జీతం అక్షరాల రూ. 40 లక్షలు (సంవత్సరానికి). బహుశా ప్రపంచంలోనే ఇలాంటి అత్యంత సౌకర్యవంతమైన ఉద్యోగం ఉండదు. ఇటువంటి బంపరాఫర్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? కానీ.. ఓ ఐఏఎస్ అధికారి మాత్రం తనకు ఈ ఉద్యోగం వద్దని చెప్తున్నారు. ఆయన పేరు అశోక్ ఖేమ్కా. తనకు అవినీతిని నిర్మూలించేందుకు స్టేట్ విజిలెన్స్ విభాగం అధిపతిగా బాధ్యతలు అప్పగించాలని కోరుతూ.. హరియాణా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చలు జరుగుతున్నాయి.
Twitter: ఎలాన్ మస్క్‌కి ఊహించని షాక్.. ట్విటర్‌పై విజిల్ బ్లోయర్ బాంబ్
తన 30 ఏళ్ల కెరీర్‌లో ఖేమ్కా 55 సార్లు బదిలీ అయ్యారు. ఈయన ఎక్కువసార్లు బదిలీ అయిన ఐఏఎస్ అధికారిగా గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం హరియాణా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఖేమ్కాకు.. అదే హోదాతో ఆర్కైవ్స్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇది ఆయనకు 56వ బదిలీ. తనకు ఈ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ రావడంతో.. హరియాణా ప్రభుత్వానికి ఆయన ఈనెల 23న ఓ లేఖ రాశారు. ‘‘జనవరి 9న నన్ను ఆర్కైవ్స్ విభాగానికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు అందాయి. ఈ విభాగం వార్షిక బడ్జెట్ రూ.4 కోట్లు. అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నాకు సంవత్సరానికి గాను రూ. 40 లక్షల జీతం ఇస్తున్నారు. అంటే.. ఆర్కైవ్స్ విభాగానికి కేటాయించిన బడ్జెట్‌లో 10% నా జీతానికి వెళ్తుంది. ఇక్కడ వారం మొత్తంలో గంటకు మించి పని ఉండదు. ఇతర అధికారులకు మాత్రం తలకు మించిన పని ఉంటోంది. ఇలా కొందరికి పనిలేకుండా, మరికొందరికి విపరీతంగా పని ఉండటం వల్ల ప్రజా ప్రయోజనాలు నెరవేరవు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
T.S. High Court : రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహించాల్సిందే
అంతేకాదు.. అవినీతిని చూసినప్పుడు తన మనసు తల్లడిల్లుతుందని, వ్యవస్థకు పట్టిన క్యాన్సర్‌ను వదిలించాలనే తపనతోనే తాను తన కెరీర్‌ను పణంగా పెట్టానని ఖేమ్కా తెలిపారు. అవినీతిని పారదోలే విషయంలో విజిలెన్స్ విభాగం ముఖ్యమైందని.. కెరీర్ చివరి దశలో ఉన్న తాను ఈ విభాగంలో సేవలు అందించాలని అనుకుంటున్నానని కోరారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే.. అవినీతికి వ్యతిరేకంగా నిజమైన యుద్ధం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా.. ఆర్కైవ్స్ శాఖలో ఆయన పనిచేయడం ఇది నాలుగోసారి. 2025లో ఖేమ్కా పదవీ విరమణ చేయనున్నారు.