Diwali Gift: బాస్ అంటే నువ్వే.. ఉద్యోగులకు దీపావళి గిఫ్టులుగా కార్లు.. ఆఫీస్ బాయ్‌కి కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Gift: ఉద్యోగి అంటే యజమాని కింద బానిస అనేలానే వ్యవహరిస్తుంటాయి చాలా కంపెనీలు. తమ ఉద్యోగుల పరిస్థితిని లెక్క చేయవు, కంపెనీ అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ఉద్యోగులపై పెద్దగా పట్టించుకోని కంపెనీలు కోకొల్లలు. కానీ కొన్ని కంపెనీల బాస్‌లు మాత్రం ఉద్యోగుల్ని సొంత మనుషులుగా చూసుకుంటారు. వారి సంక్షేమానికి డబ్బులు కేటాయిస్తుంటారు. ఇలాంటి కోవకే చెందుతుంది హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ. కంపెనీ అభివృద్ధికి పాటుపడిన ఉద్యోగుల్ని గుర్తించారు యజమాని. వారిని సర్ప్రైజ్ చేసేలా ఏకంగా కార్లనే గిఫ్టుగా ఇచ్చారు.
Read Also: AFG vs NED: ఆఫ్ఘాన్ అద్భుత ఫీల్డింగ్.. 179 పరుగులకే నెదర్లాండ్ ఆలౌట్
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్‌డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
హర్యానాలోని ఓ కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ గిఫ్టులను అందించింది. దీపావళి కానుకగా కార్లను ఇచ్చింది. పంచకులలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని ఎంకే భాటియా తన ఉద్యోగులను సెలబ్రిటీలుగా పేర్కొంటూ.. 12 మంది స్టార్ పెర్ఫార్మర్స్‌కి కార్లను బహూకరించాడు.
ఫార్మాస్యూటికల్ కంపెనీ మిట్స్ హెల్త్ కేర్, సమీప భవిష్యత్తులో మరో 38 మంది ఉద్యోగులకు కార్లను అందించాలని యోచిస్తోంది. ఈ దీపావళి బహుమతి అందుకున్న వారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉన్నారు. తన కంపెనీ విజయానికి ఉద్యోగుల కఠిన శ్రమ, అంకితభావం, విధేయత కారణమని పేర్కొన్నారు. వీరిలో కొందరు కంపెనీ ప్రారంభం నుంచి ఆయన వెంటే ఉన్నారు. ఈ కార్లు కేవలం దీపావళి కానుకలే కాదని, కంపెనీపై వారికి ఉన్న అచంచలమైన నిబద్ధత, విశ్వాసానికి రివార్డులని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గిఫ్టుగా కారు అందుకున్న వారిలో కొందరికి డ్రైవింగ్ కూడా రాదట. ఇలాంటి గిఫ్టులను తాము కలలో కూడా ఊహించలేదని ఉద్యోగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్‌రావు ఫైర్..
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..