PM Modi: చిన్నప్పుడు కప్పులు, ప్లేట్లు కడుగుతూ పెరిగాను.. చాయ్‌తో ప్రత్యేక అనుబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఉత్తర్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మరోసారి సమాజ్‌వాదీ(ఎస్పీ)ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తనకు ‘చాయ్’కి ఉన్న సంబంధం ఎంతో ప్రత్యేమైనదిగా చెప్పారు. ‘‘చిన్నతనంలో కప్పులు, ప్లేట్లు కడుగుతూ పెరిగాను. నేను టీ అందిచేవాడిని, మోడీకి టీకి మధ్య సంబంధం చాలా లోలైనది’’ అని ఈ రోజు మీర్జాపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ అన్నారు.
సమాజ్ వాదీ పార్టీకి ఓటేసి ఎవరూ కూడా తమ ఓటును వృధా చేసుకోవాలనుకోరని, మునిగిపోయే వారికి ఎవరు ఓటు వేయరని, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో వారికే ఓటేస్తారని ప్రధాని అన్నారు. ప్రజలకు ఇండియా కూటమి గురించి చాలా బాగా తెలుసని, వారు మతవిద్వేషకులని, కులపిచ్చి ఉన్నవారని, వారు అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో ఈ రెండింటి ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారని ఆరోపించారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై విమర్శలు గుప్పిస్తూ.. యాదవ సామాజిక వర్గంలో చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ, ఆయన మాత్రం తన కుటుంబానికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చారని అన్నారు.
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
Read Also: Lucknow: లక్నోలో దారుణం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్యను చంపి, దొచుకెళ్లిన దుండగులు..
ఎస్పీకి చెందిన వ్యక్తులు పట్టుబడిన ఉగ్రవాదుల్ని విడిచిపెట్టేవారని, ఇందులో ఎవరైనా పోలీస్ అధికారి అయిష్టంగా ఉంటే అతడిని సస్పెండ్ చేసేవారని, యూపీ, పూర్వాంచల్‌ని మాఫియాకు అడ్డాగా మార్చారని ప్రధాని అననారు. ఎస్పీ ప్రభుత్వం మాఫియాను ఓటు బ్యాంకుగా చూసిందని అన్నారు. యూపీ సీఎం ‘‘స్వచ్ఛతా అభియాన్’’ని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని, ఎస్పీ ప్రభుత్వం హయాంలో ప్రజానీకం ఈ మాఫియాకు వణికిపోయేవారని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో మాఫియా వణికిపోతోందని ఆయన అన్నారు.
ఇండియా కూటమి ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కోవాలని ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు.మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదని మన రాజ్యాంగం చెబుతోందని, అయితే, ఎస్పీ మాత్రం తన మేనిఫెస్టోలో దళితులు, వెనబడిని తరగతుల వారి రిజర్వేషన్లను ముస్లింకు ఇవ్వాలని పేర్కొందని చెప్పారు. దీని కోసం రాజ్యాంగం కూడా మారుస్తామని ఎస్పీ చెబుతోందని, పోలీస్, పీఏసీల్లో కూడా ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ పార్టీ చెబుతోందని, వారి ఓటు బ్యాంకు కోసం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్నారని ఆరోపించారు. పేదలు, దళితులు, వెనుకబడిన ప్రజలకు తాను అంకితమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!