Yogi Adityanath: నేరస్థులకు ప్రభుత్వం హారతి పట్టదు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP CM Yogi Adityanath: నేరస్థులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సమర్థించుకున్నారు. నేరస్థుల ఇళ్లపై ప్రభుత్వం చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్ సమర్థించారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వారికి హారతులు పట్టాలా..? అంటూ మండిపడ్డారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం బుల్డోజర్లతో నేరస్థుల ఇళ్లను ఎందుకు కూల్చివేస్తోందని అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందిస్తూ.. అక్రమంగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వారికి హారతి ఇవ్వాలా? అంటూ ప్రశ్నించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నేరస్థులు, మాఫియాపై తమ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆపరేషన్ సరైనదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ ఆస్తులను ఇష్టారీతిగా ఆక్రమించుకున్నారని.. గత ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకునేందుకు సాహసించలేదని సీఎం యోగి మండిపడ్డారు.
Read also: CM KCR: అన్నాభావు సాఠే చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులు
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
మైనారిటీ వర్గానికి చెందిన నేరస్థులనే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టారని వచ్చిన ఆరోపణలను ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ‘‘దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. అందరికీ న్యాయం చేసేందుకు కోర్టులు ఉన్నాయి. ఇంతవరకు ఒక మైనారిటీ వచ్చి తనకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేయలేదు. రాష్ట్ర ప్రజలందరికీ సమాన పరిపాలన, భద్రత అమలవుతోందని ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి అల్లర్లు జరగలేదని.. ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని వివరించారు. ఈ సందర్భంగా తృణముల్ కాంగ్రెస్‌పై యోగి మండిపడ్డారు. ఆ పార్టీ దేశాన్ని మరో పశ్చిమ బెంగాల్‌గా మార్చాలనుకుంటోందని విమర్శించారు. ‘‘పశ్చిమ బెంగాల్లో గ్రామీణ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి వ్యక్తికి ఉందని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?