బంగారం చాలా విలువైన వస్తువు. బంగారం కొనడంలో మన దేశం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అయితే.. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరిగి రూ.44,400కి చేరింది.
read also : ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి 48,440 కి చేరింది. గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆలోచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా, దేశీయంగా ధరలు పెరగడం విశేషం. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ. 200 పెరిగి రూ.75,200 కి చేరింది.