NTV Telugu Site icon

SCO Meeting: ఎస్‌సీ‌ఓ సమావేశాలకు గోవా సిద్ధం.. హాజరుకానున్న పాకిస్తాన్ మంత్రి

Jai Shankar

Jai Shankar

SCO Meeting: షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. మే 4-5 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను పరిశీలించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం గోవాలకు చేరుకున్నారు. ఎస్‌సీ‌ఓ సభ్యదేశాల్లో ఒకటైన పాకిస్తాన్ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. రష్యా, చైనా, కజకిస్తాన్, కర్గిజ్ స్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.

Read Also: Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు.. 21 మంది మృతి

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మే 4న ఉదయం గోవా విమానాశ్రయానికి చేరుకుంటారని తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి జైశకంకర్, సెర్గీ లావ్రోవ్ తో భేటీ కానున్నారు. పుతిన్ పై హత్య ప్రయత్నం తర్వాత ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశ వేదికగా రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇరు నేతల సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనున్నారు. రష్యాతో పాటు చైనా, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ ద్వైపాక్షిక సమావేశాలు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే దాయాది దేశం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోతో ఎలాంటి భేటీ ఉండదని ఉండదని తెలుస్తోంది.

2022లో సమర్ ఖండ్ లో ఎస్ సీఓ సమావేశాలు జరిగాయి. ఆ తరువాత ఈ ఏడాది అధ్యక్ష బాధ్యతలను భారత్ తీసుకుంది. దీంట్లో భాగంగానే సభ్యదేశాలతో ఇండియా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ మేరకు సభ్యదేశాలకు ఇది వరకు భారత్ ఆహ్వానాలు పంపింది. దీంట్లో భాగంగానే పాక్ మంత్రి బిలావల్ భుట్టో భారత్ వస్తున్నారు. 2014 తర్వాత ఓ పాకిస్తాన్ నేత భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే ఈ సమావేశాల్లో కూడా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు పాక్ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది.