SCO Meeting: ఎస్సీఓ సమావేశాలకు గోవా సిద్ధం.. హాజరుకానున్న పాకిస్తాన్ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SCO Meeting: షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. మే 4-5 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను పరిశీలించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం గోవాలకు చేరుకున్నారు. ఎస్సీఓ సభ్యదేశాల్లో ఒకటైన పాకిస్తాన్ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. రష్యా, చైనా, కజకిస్తాన్, కర్గిజ్ స్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.
Read Also: Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు.. 21 మంది మృతి
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మే 4న ఉదయం గోవా విమానాశ్రయానికి చేరుకుంటారని తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి జైశకంకర్, సెర్గీ లావ్రోవ్ తో భేటీ కానున్నారు. పుతిన్ పై హత్య ప్రయత్నం తర్వాత ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశ వేదికగా రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇరు నేతల సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనున్నారు. రష్యాతో పాటు చైనా, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ ద్వైపాక్షిక సమావేశాలు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే దాయాది దేశం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోతో ఎలాంటి భేటీ ఉండదని ఉండదని తెలుస్తోంది.
2022లో సమర్ ఖండ్ లో ఎస్ సీఓ సమావేశాలు జరిగాయి. ఆ తరువాత ఈ ఏడాది అధ్యక్ష బాధ్యతలను భారత్ తీసుకుంది. దీంట్లో భాగంగానే సభ్యదేశాలతో ఇండియా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ మేరకు సభ్యదేశాలకు ఇది వరకు భారత్ ఆహ్వానాలు పంపింది. దీంట్లో భాగంగానే పాక్ మంత్రి బిలావల్ భుట్టో భారత్ వస్తున్నారు. 2014 తర్వాత ఓ పాకిస్తాన్ నేత భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే ఈ సమావేశాల్లో కూడా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు పాక్ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
-
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
-
Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!