Arvind Kejriwal: ‘‘యమునా నదిలో విషం’’.. కేజ్రీవాల్‌కి ఈసీ కీలక ఆదేశం..
- ‘‘యమునా నదిలో విషం’’ అంటూ కేజ్రీవాల్ కామెంట్స్..
- రేపు రాత్రి 8 గంటల్లోగా రుజువులు ఇవ్వాలని ఈసీ ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు హర్యానా యమునా నదిలో ‘‘విషం’’ కలుపుతోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలకు రుజువులు ఇవ్వాలని ఎన్నికల సంఘం మంగళవారం కేజ్రీవాల్‌కి లేఖ రాసింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు రుజువులు ఇవ్వాలని ఆదేశించింది.
దీనికి ముందు హర్యానా నుంచి ఢిల్లీకి సరఫరా చేయబడిన నీటిలో అమ్మోనియా స్థాయిలు పెరిగాయనే ఆరోపణలకు సంబంధించి జనవరి 28 న నాటికి వాస్తవ నివేదికను సమర్పించాలని పోల్ ప్యానెల్ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనవరి 27న ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ కేజ్రీవాల్.. ప్రజలకు నీటి కొరత ఉండేలా చేయడం కన్నా పెద్ద పాపం మరొకటి ఉండదని, బీజేపీ తన మురికి రాజకీయాల కోసం ఢిల్లీ ప్రజల దాహంతో ఆటలు ఆడుతోందని, వారు హర్యానా నుంచి పంపుతున్న నీటిలో విషం కలుపుతున్నారని ఆరోపణలు చేశారు. ఈ కలుషిత నీరు విషపూరితమైనదని, ఢిల్లీలో ఉన్న నీటి శుద్ధి కేంద్రాలు వీటిని శుద్ధి చేయలేవని, బీజేపీ ఢిల్లీ వాసుల్ని సామూహిక హత్య చేయాలని అనుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
Read Also: Indiramma houses: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయనం.. కమిటీ నియామకం
ఫిబ్రవరి 05న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ వ్యాఖ్యలు రావడం సంచలనంగా మారింది. అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యల్ని హర్యానా సీఎం నయాబ్ సైనీ తిప్పికొట్టారు. ప్రభుత్వం ఆయనపై పరువు నష్టం కేసు వేయాలని యోచిస్తున్నల్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హర్యానా ప్రభుత్వంపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు అబద్ధమైతే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఢిల్లీ జల్ బోర్డ్ సీఈఓ శిల్పా షిండే, ఢిల్లీ సీఎస్‌కి లేఖ రావారు. కేజ్రీవాల్ ప్రకటనలు తప్పు అని, వాటికి ఆధారం లేదని, తప్పుదారి పట్టించేవిగా చెప్పారు. ఇలాంటి ప్రకటనలు ఢిల్లీ వాసుల్లో భయాన్ని పెంచేందుకు దోహదం చేస్తాయని ఆమె లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!