Drivers License: గుడ్ న్యూస్.. ఆర్డీవో ఆఫీసుకి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ముందుంగా దరఖాస్తు చేసుకొవాలి. ఆతర్వాత తమ పరిధిలోని ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాలి. ఆతరువాత అక్కడ గైడ్‌లైన్స్ ప్రకారం డ్రైవింగ్ చేస్తే.. తొలుత లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్.. ఆ తర్వాత శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌ను అధికారులు మంజూరు చేసేవారు. అయితే.. ఇక నుంచి అలాకాకుండా ప్రతి సామాన్యుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా గురువారం కేంద్ర జాతీయ రహదారుల.. రవాణాశాఖ మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో ఆఫీసుకెళ్లి, దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. కాగా.. ఆర్డీవో కార్యాలయం వద్ద తప్పనిసరిగా టెస్ట్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదని, కేవలం గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లలోనే డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చనీ, అన్నీ సదుపాయాలను కల్పించేలా కేంద్ర.. రాష్ట్ర అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
నిబంధనలు ఇవే :
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ఈనేపథ్యంలో.. డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి అక్రిడిటేడ్ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తాయి. అలా అక్రిడిటేడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆయా సంస్థల వద్ద డ్రైవింగ్ శిక్షణ కోసం పేరు నమోదు చేసుకోవాలి. ట్రైనింగ్.. దానికి సంబంధించిన పరీక్ష పాసైన తర్వాత సంబంధిత అభ్యర్థులకు ఆయా ట్రైనింగ్ సెంటర్లు సర్టిఫికెట్లు జారీ చేస్తాయి. అయితే.. అటుపై శిక్షణ పొందిన వ్యక్తులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ఆర్టీవో వద్ద ఎటువంటి టెస్ట్ లేకుండానే ట్రైనింగ్ సర్టిఫికెట్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు. అయితే.. సదరు ట్రైనింగ్ కేంద్రాలు.. స్టిమ్యులేటర్లు, డెడికేటెడ్ టెస్ట్ ట్రాక్‌లను కలిగి ఉండాలి. లైట్ మోటార్ వెహికల్స్, మీడియం.. హెవీ వెహికల్స్ డ్రైవింగ్‌లో సదరు అక్రిడేటెడ్ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు శిక్షణ ఇస్తాయి. లైట్ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ శిక్షణ 29 గంటల పాటు ఉంటుంది. కాగా.. కోర్స్ ప్రారంభించిన నాలుగు వారాల్లో శిక్షణ పూర్తి కావాలి. ట్రైనింగ్ సెంటర్లు తమ వద్దకు వచ్చిన అభ్యర్థులకు థియరీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలని, ఈ సెంటర్లు ఇండస్ట్రీ-స్పెసిఫిక్ స్పెషలైజ్డ్ శిక్షణ కూడా అందిస్తాయి. గతేడాదే కేంద్ర జాతీయ రహదారులు.. రవాణా మంత్రిత్వశాఖ నోటిపికేషన్ జారీ చేసింది.
అయితే.. ఇలా అక్రిడేటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా.. డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థను ప్రైవేటీకరించడమేనని.. ఈ సెంటర్లు సంబంధిత వ్యక్తులకు సరైన వెరిఫేషన్లు, తనిఖీలు చేయకుండానే డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తాయని ఆయా రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..