అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటే.. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత మరికొన్ని ఆసక్తికరమైన పరిణామలు జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్‌లో.. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్‌కతాలోని టీఎంసీ కార్యాలయంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఎంసీలో చేరానని అన్నారు. తనకు టీఎంసీలో ఏ పదవి ఇచ్చినా… సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. బెంగాల్‌లో బీజేపీ ప్రవేశాన్ని అడ్డుకున్నపార్టీలో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. బీజేపీ మతతత్వాన్ని మమత విజయవంతంగా అడ్డుకోగలిగారని… ఇదే మాదిరి భవిష్యత్‌లో కూడా వివిధ పార్టీలతో కలిసి దేశ వ్యాప్తంగా మతతత్వాన్ని అమె అడ్డుకోగలరని అన్నారు అభిజిత్ ముఖర్జీ. గత ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. ఘోర పరాజయాన్ని ముఠ గట్టుకుంది.. ఇక, ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కొందరు నేతలు కూడా తిరిగి టీఎంసీ గూటికి చేరుతున్న విషయం తెలిసిందే.