Abhijit Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో కొంతకాలంగా పని చేస్తున్న ఆయన తిరిగి సొంతగూటికి చేరారు. బుధవారం, కోల్‌కతాలో AICC ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, ఇతర రాష్ట్ర నాయకుల సమక్షంలో అభిజిత్ అధికారికంగా పార్టీలో తిరిగి చేరారు. 2021లో కాంగ్రెస్ నుంచి టీఎంసీలో చేరిన ఆయన, తిరిగి రావడాన్ని సొంతింటికి వస్తున్నట్లుగా అభివర్ణించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటే.. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత మరికొన్ని ఆసక్తికరమైన పరిణామలు జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్‌లో.. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్‌కతాలోని టీఎంసీ కార్యాలయంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఎంసీలో చేరానని అన్నారు. తనకు టీఎంసీలో ఏ పదవి ఇచ్చినా… సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. బెంగాల్‌లో బీజేపీ…