Karnataka sex scandal: తన తల్లిని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించాడు.. హెచ్‌డీ రేవణ్ణపై సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka sex scandal: కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల కేసు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌కి సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు ఇటీవల కర్ణాటక వ్యాప్తంగా, ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి పట్టు ఉన్న హసన్ జిల్లాలో వైరల్‌గా మారాయి. దీని తర్వాత రేవణ్ణ ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు అతని తండ్రి, జేడీయూ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. దీనిపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ నిమిత్తం సిట్ ఏర్పాటు చేసింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశం నుంచి జర్మనీ వెళ్లారు. అతడిపై కర్ణాటక పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా హెచ్‌డీ రేవణ్ణపై సంచలన ఆరోపణలు నమోదయ్యాయి. తన తల్లిని హెచ్‌డీ రేవణ్ణ కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ కొడుకు 20 ఏళ్ల యువకుడు ఆరోపించాడు. దీంతో అతడిపై కిడ్నాప్ కేసు నమోదైంది. గత నెలలో తల్లిపై లైంగిక వేధింపుల వీడియో వైరల్‌గా మారింది. ఫిర్యాదు చేసిన వ్యక్తి హెచ్‌డీ రాజు, అతని తల్లి రేవణ్ణ ఫామ్‌హౌజులో పని చేస్తున్నారు. అయితే, ఈ కేసులో హెచ్‌డీ రేవణ్ణ ముందస్తు బెయిల్ కోరారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Read Also: Supreme Court: ‘‘రాహుల్ గాంధీ పేరు ఉన్నంత మాత్రాన’’.. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థుల్ని నిషేధించలేం..
తన తల్లి ఏప్రిల్ 29 నుంచి తప్పిపోయిందని ఆరోపిస్తూ హెచ్‌డీ రాజు కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మే 2న ఫిర్యాదు చేశారు. ఆమె కనిపించకుండా పోయిన తర్వాత నుంచి ఆమెని లైంగికంగా వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను, తన తల్లి రేవణ్ణ ఫామ్ హౌజులో ఆరేళ్లుగా పనిచేస్తున్నామని రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, మూడేళ్ల క్రితం ఆమె అక్కడ పనిచేయడం మానేసింది. ఏప్రిల్ 26న రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు 3-4 రోజుల ముందు తమకు తెలిసిన వ్యక్తి తమ ఇంటికి వచ్చి, రేవణ్ణ భార్య భవానీ తన తల్లిని ఏదో పని నిమిత్తం పిలిచిందని రాజు పేర్కొన్నాడు.
ఏప్రిల్ 26న సతీష్ అనే వ్యక్తి తన తల్లిని తిరిగి ఇంటికి తీసుకువచ్చానడి, అయితే, పోలీసలుు తమ ఇంటికి వస్తే తల్లితో కలిసి పారిపోవాలని సతీష్ రాజుతో చెప్పాడు. మూడు రోజుల తర్వాత ఏప్రిల్ 29న రాత్రి 9 గంటల ప్రాంతంలో సతీస్ తమ నివాసానికి వచ్చి తన తల్లిని తీసుకువాలని రేవణ్ణ ఆదేశించాడని చెప్పి బలవంతంగా తీసుకెళ్లినట్లు రాజు చెప్పాడు. మే 1న తన తల్లిని లైంగికంగా వేధించిన వీడియో వైరల్ అయిందని, ఈ విషయం తన స్నేహితుల ద్వారా తెలిసిందని రాజు చెప్పారు. ఆ వీడియోలో తన తల్లి కాళ్లను కట్టివేసి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు కనిపించిందని చెప్పారు. అదే రోజు తన తల్లి ఆచూకీ తెలుసుకునేందుకు సతీష్ కి ఫోన్ చేస్తే ఆమెపై కేసు నమోదైందని, ఆమెకు బెయిల్ కావాలని చెప్పాడని రాజు చెప్పారు. గతంలో రేవణ్ణతో జరిగి గొడవపై మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఆమె కర్రతో ఉన్న ఫోటో బయటపడినట్లు సతీష్ చెప్పాడు. దీంతో రాజు తన తల్లిని కిడ్నాప్ చేసి ఉండొచ్చని అనుమానించి పోలీసుల్ని ఆశ్రయించాడు. తన తల్లిని కొనుగొనాలని ఆయన కోరాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!