ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే అనూహ్యంగా రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల చేత రాజీనామా చేసినట్లుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ పంపించారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని శుక్రవారం ఖాళీ చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకెళ్లి.. అనంతరం ఆరు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఊహించని రీతిలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషిని ఆ సీటులో కూర్చోబెట్టారు. సెప్టెంబర్ 21న అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.