PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ హయాంలోని యూపీఏ పాలనపై విమర్శలు గుప్పించారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ‘‘బలహీనత’’ను ప్రదర్శించిందని ఆరోపించారు. అప్పటి రాజకీయ నిర్ణయాలు మరో దేశం నుంచి వచ్చిన ఒత్తిడి ద్వారా ప్రభావితమయ్యాయని బుధవారం ఆరోపించారు. ముంబై దేశంలోని అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటి అని, అందుకే ఉగ్రవాదులు 26/11 దాడులకు తెగబడ్డారని అన్నారు.
ఇటీవల, కాంగ్రెస్ మాజీ హోం మంత్రి పి. చిదంబరం ముంబై ఉగ్రదాడుల గురించి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల ఒత్తిడి వల్ల తాము పాకిస్తాన్‌పై దాడి చేయలేదని చెప్పారు. ముంబై దాడుల తర్వాత మన భద్రతా దళాలు పాకిస్తాన్‌పై దాడి చేయడానికి సిద్ధమయ్యాయయని, కానీ వేరే దేశం ఒత్తిడి కారణంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతా బలగాలను ఆపిందని చిదంబరం అన్నారు.
Read Also: Asaduddin Owaisi: రాకేష్ కాకుండా, చీఫ్ జస్టిస్‌పై ‘‘అసద్’’ దాడికి పాల్పడుంటే..?
దీనిపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఏ దేశం ఒత్తిడి తెచ్చిందో వెల్లడించాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం కారణంగా భారత్ తీవ్రంగా నష్టపోయిందని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ బలహీనత ఉగ్రవాదుల్ని బలపరిచిందని, ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా దేశం పదే పదే ఉగ్రవాదానికి మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. మన దేశ భద్రత, పౌరుల భద్రత కన్నా మరేది ముఖ్యం కాదని మోడీ అన్నారు. పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ ప్రస్తావిస్తూ, నేటి భారతదేశం తన శత్రువులను వారి ఇళ్లలోకే వెళ్లి హతమారుస్తోదని ప్రధాని అన్నారు.
నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ‘‘వికసిత్ భారత్’’ను ప్రతిబింబించే ప్రాజెక్ట్ అని ప్రధాని అఅన్నారు. కొత్త విమానాశ్రయం ద్వారా మహారాష్ట్రలోని రైతుల ఉత్పత్తులు మిడిల్ ఈస్ట్, యూరప్ మార్కెట్లతో అనుసంధానించబడుతాయని చెప్పారు.
