Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News For The 1st Time Private Sector Allowed To Invest In Atomic Energy

Budget 2024: తొలిసారిగా, అణుశక్తిలో పెట్టుబడులకు ప్రైవేట్ రంగానికి అనుమతి..

Published Date :July 23, 2024 , 7:45 pm
By Venu Goapl Reddy
  • తొలిసారిగా.. అణుశక్తి రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి..
  • బడ్జెట్ స్పీచ్‌లో వెల్లడించిన కేంద్రమంత్రి..
Budget 2024: తొలిసారిగా, అణుశక్తిలో పెట్టుబడులకు ప్రైవేట్ రంగానికి అనుమతి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ‘‘అణుశక్తి’’కి సంబంధించి కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ‘‘విక్షిత్ భారత్ అణుశక్తి చాలా ముఖ్యమైందని’’ వ్యాఖ్యానించిన మంత్రి.. భారత్ ఇప్పుడు స్మాల్ రియాక్టర్లను, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అభివృద్ధి చేయడానికి, పరిశోధనలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దేశ చరిత్రలో మొదటిసారిగా అణు శక్తి రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతిస్తూ చారిత్రాత్మక నిర్ణయాన్ని వెల్లడించారు. మొదటిసారిగా అణు కర్మాగారాల ఏర్పాటులో భాగస్వామిగా ఉండటాన్ని ప్రైవేట్ రంగాన్ని అనుమతించారు.

ప్రైవేట్ రంగాన్ని అనుమతించడం ఒక నూతన ప్రారంభమని నీతి ఆయోగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సభ్యుడు వికె సరస్వత్ చెప్పారు. పరమాణు శక్తి తక్కువ కార్బన్ ఉద్గారాలతో, శక్తిని అందిస్తుందని, కాబట్టి ప్రభుత్వం స్మాల్ రియాక్టర్ల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ నిర్ణయంపై ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పిసిఐఎల్) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ భువన్ చంద్ర పాఠక్ మాట్లాడుతూ.. అణుశక్తి అభివృద్ధిలో భాగస్వామిగా ఉండటానికి ప్రైవేట్ రంగానికి అనుమతి ఇవ్వడం చాలా స్వాగతించదగిన విషయమని అన్నారు.

Read Also: Yeto Vellipoyindi Manasu : అసలే బిజీ అంటే ‘సమంత- నాని’ల సినిమా కూడా దింపుతున్నారు!

వాతావరణ మార్పు ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో జీరో కార్బన్ ఉద్గారాలు కలిగి విద్యుత్‌ని అందించే అణుశక్తి అనేది అందరి ముందు ఉన్న ప్రత్యామ్నాయం. ఈ రోజు తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘‘భారత్ స్మాల్ రియాక్టర్స్ (BSR), భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (BSMR) రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, న్యూక్లియర్ టెక్నాలజీల రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం మా ప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్‌తో భాగస్వామి అవుతుంది.’’ అని ఈ రంగానికి మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్ అండ్ డీ నిధులు అందుబాటులో ఉంచబడతాయని చెప్పారు.

భారతీయ అణుశక్తి చట్టం -1962 ప్రకారం.. అణుశక్తి ఉత్పత్తి ప్రైవేట్ రంగాన్ని పాల్గొనడానికి అనుమతించదు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు ప్రకారం, భారతదేశం ఇప్పటికే 6780 మెగావాట్ల అణుశక్తిని కలిగి ఉంది. ప్రస్తుతం, భారతదేశంలో 22 ఆపరేటింగ్ రియాక్టర్లు ఉన్నాయి, వాటిలో 18 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు (PHWRs) మరియు నాలుగు లైట్ వాటర్ రియాక్టర్లు (LWRs). బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, భారత్ కూడా ప్రైవేట్ రంగానికి సహకరించడం ద్వారా మాడ్యులర్ రియాక్టర్లను అభివృద్ధి చేస్తుంది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అనేది అణు విద్యుత్ ప్లాంట్‌లను తయారు చేయడంలో పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌గా చెప్పవచ్చు. విద్యుత్‌తో పాటు సిమెంట్, ఉక్కు పరిశ్రమల వంటి పెద్ద పరిశ్రమీలకు క్యాప్టివ్ పవర్ యూనిట్‌లుగా పరిష్కారాన్ని అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చిన్న మాడ్యులర్ రియాక్టర్లను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే రష్యాలో మాత్రమే ఫంక్షనల్ యూనిట్లు ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • budget 2024
  • India's Nuclear energy
  • NITI Aayog
  • Union Budget 2024

తాజావార్తలు

  • US-Iran War: తెరిచి ఉన్న “హార్ముజ్‌”ను యుద్ధం చేసి తెరిపిస్తున్న యూఎస్.. ఇదే విచిత్రం..

  • Bihar Madarsa: మదర్సా ముసుగులో నేర సామ్రాజ్యం? పోలీసుల సోదాల్లో విస్తుపోయే నిజాలు!

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions