Flying Buses: మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ చేస్తుంది. ఈ సందర్భంగా మెట్రో సిటీల్లో ఎలివేటెడ్ ఎయిర్‌పాడ్ ఆధారిత వ్యవస్థలు, ఫ్లాష్-చార్జింగ్ ఎలక్ట్రిక్ బస్సులు లాంటి కొత్త రవాణా పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ సందర్భంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. 2014లో అధికారంలోకి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా రవాణాకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఢిల్లీ, పుణే, బెంగళూరు లాంటి నగరాల్లోని ప్రజలు ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. దీని వలన వేగం, పర్యావరణ స్థిరత్వంపై దృష్టి సారించే ప్రత్యామ్నాయలు చేస్తున్నామని నితీన్ గడ్కరీ వెల్లడించారు.
Read Also: Honeymoon Murder: మరో ట్విస్ట్.. జితేంద్ర యూపీఐ నుంచి నిందితులకు నగదు బదిలీ! పోలీసుల ఆరా
ఇక, మన దేశంలో అతి ముఖ్యమైన సమస్య కాలుష్యం.. రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నామని కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ తెలిపారు. భారతీయ సమాజం ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. ఇప్పుడు సౌకర్యాన్ని కోరుకుంటోంది అన్నారు. లగ్జరీ బస్సులతో పోలిస్తే, ప్రజలు సౌకర్యంగా ఉండటానికి ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు. దీంతో ఢిల్లీ, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో రద్దీని తగ్గించడానికి ఎగిరే బస్సులను త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తాని చెప్పుకొచ్చారు. ఇవి ఎలివేటెడ్ ట్రాక్‌లపై పని చేసే డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్‌లు అన్నారు. ప్రతిదాంట్లో 135 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది అని నితీన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.
అయితే, ఫ్లాష్-ఛార్జింగ్ వ్యవస్థ ప్రధాన ఆవిష్కరణగా భారత్ లో నిలవనుంది అని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. ఈ బస్సులు స్టేషన్‌లో ఆగినప్పుడు, ఆటోమేటిక్ ఛార్జింగ్ యూనిట్ వాహనంతో అనుసంధానించబడుతుందని.. ఇది సుమారు 40 కిలోమీటర్ల వరకు నడుస్తుందని వివరించారు. వీటికి సంబంధించిన టెండర్లు అమెరికా, యూరోపియన్ దేశాలతో పాటు రష్యా నుంచి వచ్చాయి. కానీ అవి ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నాయని మనం నిర్ధారించుకోవాలి అని సూచించారు. ఈ సేవలను దేశ ప్రజలకు చౌక ధరకు అందించాలని ప్లాన్ చేస్తున్నామని నితీన్ గడ్కరీ చెప్పారు.
