Flying Buses: మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ చేస్తుంది. ఈ సందర్భంగా మెట్రో సిటీల్లో ఎలివేటెడ్ ఎయిర్‌పాడ్ ఆధారిత వ్యవస్థలు, ఫ్లాష్-చార్జింగ్ ఎలక్ట్రిక్ బస్సులు లాంటి కొత్త రవాణా పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది.