Finger ice cream: ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు.. ఎవరిదో కనుక్కున్న ఫోరెన్సిక్ నిపుణులు..
- ఐస్ క్రీంలో వేలు..
- వైరల్ అయిన ముంబై ఘటన..
- డీఎన్ఏ టెస్టులో ఫ్యాక్టరీ వర్కర్దిగా గుర్తింపు..
- ఐస్ క్రీం నింపే క్రమంలో తెగిన వేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Finger ice cream: ఇటీవల ముంబైలో ఓ డాక్టర్ ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు రావడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఐస్‌క్రీం కోన్‌లో తెగిన వేలు కనిపించింది. ఈ విషయం పెద్ద ఎత్తున వైరల్ కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. వేలు ఎవరిదో కనుక్కునేందుకు దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు.
Read Also: Vande Bharat Express: వందేభారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం 130 కి.మీకి తగ్గింపు..
Also Read
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
వేలికొనై ఉన్న డీఎన్ఏ ఐస్‌క్రీం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగి ఓంకార్ పోటేదిగా తేలిందని పోలీసులు గురువారం తెలిపారు. ఇందాపూర్ ఫ్యాక్టరీలో కోన్‌లో ఐస్‌క్రీం నింపే సమయంలో ఓంకార్ వేలిలో కొంత భాగం కట్ అయింది. ఇది ఆ తర్వాత ఐస్‌క్రీం కొన్‌లో పడిపోయింది. జూన్ 12, 2024న మలాడ్‌లోని ఓర్లెమ్ నివాసి అయిన డాక్టర్ బ్రెండన్ ఫెర్రావ్ ఆన్లైన్ యాప్ ద్వారా మూడు ఐస్ క్రీమ్ కోన్లను ఆర్డర్ చేసినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఆర్డర్ చేసిన దాంట్లో ఒకటి యమ్మో బ్రాండ్ బటర్ స్కాచ్ ఐస్‌క్రీం ఉంది. దీనిపై డాక్టర్ ఫెర్రాన్ మాట్లాడుతూ..‘‘ నేను ఐస్ క్రీం మధ్యలోకి రాగానే, అకస్మాత్తుగా నాకు అక్కడ పెద్ద ముక్క అనిపించింది. మొదట్లో, అది పెద్ద గింజ అని నేను అనుకున్నాను. అదృష్టవశాత్తూ, నేను తినలేదు. అయితే, దానిని దగ్గరగా చూసిన తర్వాత, నేను దానిపై ఒక గోరును చూశాను.’’ అని చెప్పారు. ఈ ఘటనతో షాక్‌కి గురయ్యానని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో యమ్మో ఐస్ క్రీం కంపెనీపై కేసు నమోదు చేసి ఐస్ క్రీం శాంపిళ్లను ఫోరెన్సిక్ విచారణకు పంపారు.
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!