Finger ice cream: ఇటీవల ముంబైలో ఓ డాక్టర్ ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు రావడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఐస్‌క్రీం కోన్‌లో తెగిన వేలు కనిపించింది. ఈ విషయం పెద్ద ఎత్తున వైరల్ కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. వేలు ఎవరిదో కనుక్కునేందుకు దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు.