BJP: కాంగ్రెస్ హయాంలో సిక్కుల ఊచకోత మరిచావా..? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- అమెరికాలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- సిక్కుల గురించి కామెంట్స్..
- విదేశాల్లో పరువు తీస్తున్నాడని బీజేపీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఆయన సిక్కుల గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ‘‘సిక్కులు భారతదేశంలో తలపాగా ధరించడానికి, గురుద్వారాని సందర్శించడానికి అనుమతించబోతున్నారా లేదా అనేదానిపై పోరాటం’’ అంటూ వ్యాక్యలు చేశారు. వర్జీనియా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ…‘‘ భారతదేశంలో సిక్కులు తలపాగా ధరించాడానికి అనుమతిస్తున్నారా..? లేదా అనే దానిపై పోరాటం జరుగుతోంది. భారతదేశంలో సిక్కులు కడాను ధరించడానికి, గురుద్వారా వెళ్లడానికి అనుమతించబడుతున్నారా లేదా?? ఇది కేవలం సిక్కులకే కాదు, అన్ని మతాలకు సంబంధించింనది’’ అంటూ వ్యాఖ్యాలు చేశారు.
ఇదే కాకుండా.. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత పీఎం మోడీ పట్ల ఉన్న భయం తొలిగిపోయిందని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘ఎన్నికల తర్వాత ఏదో మార్పు వచ్చింది. ప్రధాని మోదీ భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. వివిధ ఏజెన్సీలు, మీడియా, ఆదాయపు పన్ను శాఖలు చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలలో కూడా భయాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాయి. కానీ, ఏమీ పని చేయలేదు. అందరిలో భయం మాయమైంది.’’ అని అన్నారు. మోడీ ప్రభావం గణనీయంగా తగ్గిపోయిందని, భయం వ్యాప్తి చెందడానికి ఏళ్లు పట్టింది, చాలా డబ్బు వినియోగించింది, కానీ ఇప్పుదని అదృశ్యమైందని అన్నారు. 56 ఇంచుల ఛాతీ, దేవుడితో ప్రత్యక్ష సంబంధం అంతా పోయిందని ఇప్పుడు చెప్పగలనని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
Read Also: CM relief fund: సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరివిగా విరాళాలు
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. భారతదేశంలో పరిస్థితిని వక్రీకరించాలనే ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని, విదేశాల్లో దేశాన్ని అవమానించే ప్రయత్నం చేస్తున్నాడంటూ బీజేపీ మండిపడింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో సిక్కులను చంపేసిందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీలా గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నించే వారు మూడోసారి ఓడిపోయారని ఎద్దేవా చేశారు.
బీజేపీ నేత ఆర్పీ సింగ్ కూడా గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. ‘ఢిల్లీలో మూడు వేల మంది సిక్కుల్ని ఊచకోత కోశారు. వారి తలపాగాలను విప్పారు. జుట్టు కత్తిరించారు. గడ్డం గీశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలా జ రిగిందని ఆయన చెప్పడం లేదు. రాహుల్ గాంధీ భారతదేశంలో ఇది పునరావృతం చేయాలని సవాల్ చేస్తూ, అతను సిక్కుల గురించి ఏం మాట్లాడుతున్నాడు..? అతడిపై కేసు వేసి కోర్టుకి లాగుతా అని హెచ్చరించారు. విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నాడని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు, బాధ్యతాయుతంగా మాట్లాడాలని, అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ రోజూ కూడా విదేశాల్లో దేశాన్ని విమర్శించలేదని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!