New Delhi: సత్యేంద్ర జైన్ కు మధ్యంతర బెయిల్ పొడిగింపు.. సుప్రీంకోర్టు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Delhi: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సత్యేంద్ర జైన్‌కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను పొడిగించారు. మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ కు వైద్య కారణాలతో మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు జూలై 24 వరకు పొడిగించింది. అతడి వైద్య నివేదికలను అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సమర్పించాలని జైన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
Read also: Ponguleti: త్వరలో ఫ్లో మొదలవుతుంది.. పాలమూరు సభ ఖమ్మంని మరిపించేలా ఉంటుంది
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
జైన్ కు శస్త్రచికిత్స చేయాలని మూడు ఆస్పత్రులు సిఫారసు చేశాయని సింఘ్వీ తెలిపారు. వైద్య కారణాల దృష్ట్యా మే 26న జైన్ కు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఒక పౌరుడు తన సొంత ఖర్చులతో ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు నచ్చిన చికిత్స పొందే హక్కు ఉందని పేర్కొంది. జైన్ తో సంబంధం ఉన్న నాలుగు కంపెనీల ద్వారా ఆయన మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తూ.. గత ఏడాది మే 30న జైన్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అవినీతి నిరోధక చట్టం కింద 2017లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో జైన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. అయితే సీబీఐ నమోదు చేసిన కేసులో 2019 సెప్టెంబర్ 6న ట్రయల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
Read also: Pawan Kalyan: పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు
ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లను జూలై 14న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తన భార్య తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిందని, ఈ కేసును విచారణకు స్వీకరించాలని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టును కోరడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించేందుకు అంగీకరించింది.ఈ కేసు విచారణను జూలై 17న లిస్ట్ చేసినప్పటికీ జూలై 14న విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోరుతూ సిసోడియా గతవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో తన బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన రెండు ఉత్తర్వులను ఆయన సవాల్ చేశారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఎక్సైజ్ శాఖను కూడా నిర్వహించిన సిసోడియాకు.. లిక్కర్ పాలసీ స్కామ్ లో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!