Site icon NTV Telugu

PM Modi: పాకిస్తాన్‌లో పేలుళ్లతో కాంగ్రెస్ రాజకుటుంబానికి నిద్ర కరువు..

Pmmodi

Pmmodi

PM Modi:ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత దేశం తన సైన్యాన్ని చూసి గర్వపడిందని, కానీ కాంగ్రెస్-ఆర్జేడీ దానిని ఇష్టపడటం లేదని ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. బీహార్‌లోని అర్రాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. రెండు పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్‌లో పేలుళ్లు జరిగితే, కాంగ్రెస్ రాజకుటుంబం నిద్ర కోల్పోతోంది. ఆపరేషన్ సిందూర్ షాక్ నుంచి పాకిస్తాన్, కాంగ్రెస్ కోలుకోలేదు’’ అని గాంధీ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు.

Read Also: Andhra-King-Taluka : షూటింగ్‌ కంప్లీట్‌ – ప్రమోషన్లు స్టార్ట్‌..!

విక్షిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) ప్రతిజ్ఞతో ఎన్డీఏ ముందుకు సాగుతోంది. మరోవైపు, కాంగ్రెస్,ఆర్జేడీ ఘర్షణ పడుతున్నాయని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక రోజు ముందు బీహార్‌లో మూసిన తలుపుల వెనక దొంగల ఆట జరిగిందని ప్రధాని ఆరోపించారు. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేతను పేర్కొనడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, ఆర్జేడీ కాంగ్రెస్ తలపై తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి పదవిని దొంగిలించని ప్రధాని ఆరోపించారు.

ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య గొడవ తీవ్రమైందని, మేనిఫెస్టోపై కాంగ్రెస్‌ను సంప్రదించలేదని, ఎన్నికల ముందు ఇంత ద్వేషం ఉంటే, ఎన్నికల తర్వాత ఒకరి తలలు ఒకరు పగలగొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారు బీహార్ అభివృద్ధికి పనికి రారు అని ప్రధాని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ పాలన జంగిల్ రాజ్ అని, ఎన్డీయే పాలన సుపరిపాలన అని ప్రధాని అన్నారు. నితీష్ కుమార్, ఎన్డీయే ప్రభుత్వం బీహార్‌ను జంగిల్ రాజ్ లాంటి క్లిష్ట కాలం నుంచి బయటకు తీసుకువచ్చిందని ప్రధాని చెప్పారు.

Exit mobile version