Pakistan: రాహుల్ గాంధీపై మరోసారి ప్రశంసలు కురిపించిన “పాకిస్తాన్ మాజీ మంత్రి”.. ఈ సారి ఏ అంశంపై అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఎన్నికల సమయంలో పాకిస్తాన్ మాజీ మంత్రి రాహుల్ గాంధీని పొగుడుతుండటం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంటే, మరోసారి పాక్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ మరోసారి కాంగ్రెస్ నాయకుడిపై ప్రశంసలు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపద పునర్విభజన సర్వే నిర్వహిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అయితే, ఈ హామీని ఫవాద్ హుస్సేన్ కొనియాడారు. రాహుల్ గాంధీని భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో పోల్చుతూ.. ఇద్దరూ “సోషలిస్టులే” అని అన్నారు.
కొన్ని రోజుల క్రితం అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్టపై బీజేపీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను ఫవాద్ హుస్సేన్ షేర్ చేసి ‘‘రాహుల్ ఆన్ ఫైర్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వ్యవహారంపై బీజేపీ భగ్గుమంది. కాంగ్రెస్ అంటే పాకిస్తాన్‌కి ఇష్టమని ఆరోపించింది. యువరాజు(రాహుల్ గాంధీని) ప్రధాని చేయడానికి పాకిస్తాన్ తెగ ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు.
Also Read
Read Also: Ponguleti Srinivasa Reddy: బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్‌లో చౌదరి ఫవాద్ హుస్సేన్ సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. శనివారం ఆయన రాహుల్ గాంధీని ‘‘రాహుల్ సాహిబ్’’ అని సంభోదిస్తూ ట్వీట్ చేశారు. ‘‘రాహుల్ గాంధీ తన ముత్తాత జవహర్‌లాల్ (నెహ్రూ) వలె అతనిలో సోషలిస్ట్ ఉన్నాడు. భారత్, పాకిస్తాన్ సమస్యలు దేశ విభజన జరిగిన 75 ఏళ్ల తర్వాత కూడా ఒకే విధంగా ఉన్నాయి, రాహుల్ సాహిబ్ తన చివరి రాత్రి ప్రసంగంలో 30 లేదా 50 కుటుంబాలు భారతదేశ సంపదలో 70 శాతం కలిగి ఉన్నారు అని చెప్పారు. పాకిస్తాన్‌లో కూడా బిజినెస్ క్లబ్ అని పిలువబడే పాకిస్తాన్ బిజినెస్ కౌన్సిల్, కొందరు రియల్ ఎస్టే్ట్ వ్యాపారులు 75 శాతం పాకిస్తాన్ సంపదనను కలిగి ఉన్నారు. సంపద న్యాయమైన పంపిణీ పెట్టుబడీదారు విధానంలో అతిపెద్ద సవాలు’’ అని అన్నారు.
రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు విరుచుకుపడ్డారు. అతనికి పాకిస్తాన్‌లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అన్నారు. పాకిస్తాన్‌లో రాహుల్ గాంధీపై నాన్ స్టాప్ ప్రశంసలు కురుస్తున్నాయి. మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ వంటి సీనియర్ రాజకీయ నాయకులు కూడా రాహుల్ గాంధీకి అతిపెద్ద అభిమానే అంటూ ట్వీట్ చేశారు. అతని కుటుంబం గాంధీ కుటుంబం పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. అతను రాహుల్ సాహిబ్ అనే పదాన్ని వాడాడు, కాంగ్రెస్ ఇప్పటి వరకు దాన్ని ఖండించలేదు. బీజేపీ ఓడిపోవాలని, కాంగ్రెస్ గెలవాలని పాకిస్తాన్ కోరుకుంటోందని కిరణ్ రిజిజు అన్నారు.
Rahul Gandhi like his great Grandfather Jawaharlal has a socialist in him, problems of India and Pak are so same even after 75 years of partition, Rahul sahib in his last night speech said 30 or 50 families Owns 70% of India wealth so is in Pakistan where only a business club…
— Ch Fawad Hussain (@fawadchaudhry) May 4, 2024
తాజావార్తలు
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
-
Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
-
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!