RSS Chief Mohan Bhagwat: భారత్‌లో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషనే..
- 100వ ఏడాదిలోకి అడుగు పెట్టిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్..
- భారత్‌లో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషే: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Chief Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటై 100వ ఏడాదిలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఈ విజయదశమిని పురస్కరించుకొని మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్.రాధాకృష్ణన్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. భారత్‌లో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషే అని పేర్కొన్నారు. అలాగే, సామాజిక ఐక్యత, సామరస్యం కోసం కులమతాలకు అతీతంగా వ్యక్తుల మధ్య స్నేహం ఉండాలన్నారు. బంగ్లాదేశ్‌లో హిందూవులపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. ప్రాంతంతో సంబంధం లేకుండా ఐక్యంగా ఉంటే.. ఎలాంటి గొడవలకు తావుండదన్నారు. అలాగే, ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధంపై మోహన్ భగవత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: ICICI Bank Scam Case: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ స్కామ్.. సెల్పీ వీడియోతో బ్యాంక్ మేనేజర్ సంచలనం..
Also Read
ఇక, దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న బెంగాల్ ఆర్జీకర్ హస్పటల్ లో జరిగిన హత్యాచార ఘటనపై కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత సర్కార్ ది.. నేరం జరిగినప్పటికీ, బాధితురాలికి న్యాయం జరగకపోవడం సమాజాన్ని నిరుత్సాహపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ లీడర్ సురేశ్ భయ్యాజీ మాట్లాడుతూ.. రాష్ట్రాలు వేరు వాటి సంస్కృతులు, భాషలు వేర్వేరు.. ఒక భాషే గొప్పదనే అనవసర భ్రమను కొందరు సృష్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. తమిళం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ.. ఇలా భారతీయులు మాట్లాడే ప్రతి భాషా.. జాతీయ భాషే అని చెప్పుకొచ్చారు. భాష వేరు అయినా.. ఒక భారతీయుడిగా మన ఆలోచన ఒకే విధంగా ఉంటుందన్నారు.
తాజావార్తలు
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!