EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
- ఖాతాదారులకు మళ్లీ అలర్ట్
- ఆన్లైన్ సేవల నిలిపివేత పొడిగింపు
- జూలై 2 వరకు సేవలకు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈపీఎఫ్‌వో సేవలకు మరోసారి బ్రేక్ పడింది. గత నెలలో అప్‌గ్రేడ్ కోసం కొన్ని రోజులు సేవలను నిలిపివేసింది. తాజాగా మరోసారి ఆన్లైన్ సేవలు నిలిపివేసినట్లు సంస్థ తెలిపింది. జూలై 2 వరకు ఆన్లైన్ సేవలు పని చేయవమని వెల్లడించింది.
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తన ఆన్లైన్ సేవల నిలిపివేత గడువును మరోసారి పొడిగించింది. భారీ స్థాయిలో డేటాబేస్ విలీనం, సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సేవలను మరో మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం జూలై 2 అర్ధరాత్రి నుంచి సేవలు తిరిగి అందుబాటులోకి రానున్నాయి. ముందుగా ఈ నిర్వహణ పనులు జూన్ 28తో పూర్తవుతాయని.. జూన్ 29 నుంచి సేవలు పునరుద్ధరిస్తామని తెలిపింది. అయితే సాంకేతిక మార్పులు ఆశించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో గడువును సవరించింది. ప్రస్తుతం జూన్ 26 అర్ధరాత్రి ప్రారంభమైన నిర్వహణ పనులు జూలై 1 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగనున్నాయి.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
నిర్వహణ పనుల కారణంగా ఈపీఎఫ్‌వో సభ్యులు, యజమానులు ఆన్లైన్ సేవలను వినియోగించలేరు. సభ్యులు పీఎఫ్ విత్‌డ్రాయల్ క్లెయిమ్ దాఖలు చేయడం, క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవడం, పాస్‌బుక్ చూడడం, వ్యక్తిగత వివరాలు సవరించడం, ఖాతా బదిలీ కోసం దరఖాస్తు చేయడం వంటి సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అదే విధంగా యజమానులు కూడా యజమాని ఇంటర్ఫేస్లో లాగిన్ అయి ఉద్యోగుల పీఎఫ్‌కు సంబంధించిన కంప్లయన్స్ ఫైలింగ్‌లు, ఇతర పరిపాలనా పనులు పూర్తి చేయలేరు.
ఎందుకు ఈ అప్‌గ్రేడ్?
ఈ సాంకేతిక మార్పుల ప్రధాన ఉద్దేశం క్లెయిమ్ ప్రాసెసింగ్ వ్యవస్థను ఆధునీకరించడం అని ఈపీఎఫ్‌వో తెలిపింది. డేటాబేస్ విలీనం, సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ పూర్తయిన తర్వాత సేవలు మరింత వేగంగా… సురక్షితంగా.. సమర్థవంతంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. దీంతో సభ్యులకు మెరుగైన డిజిటల్ అనుభవం లభిస్తుందని సంస్థ వెల్లడించింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూలై 2 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆన్లైన్ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సేవల నిలిపివేత వల్ల కలిగిన అసౌకర్యానికి ఈపీఎఫ్‌వో చింతిస్తున్నట్లు తెలిపింది. నిర్వహణ కాలంలో ఏవైనా సహాయం అవసరమైతే సభ్యులు 14470 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!