Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chanakya Neeti: ఎంత కష్టపడుతున్నా సక్సెస్ దక్కడం లేదా? ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వచ్చి విజయం ముందట మీ ప్రయాణం ఆగిపోతోందా? అయితే మీరు చేస్తున్నది పనిలో లోపం లేదని చాణక్యుడు చెబుతున్నారు. చాలా మందికి ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందే దాన్ని పదిమందికీ చెప్పుకోవడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రచారం చేసుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది. కానీ సరిగ్గా ఇదే అలవాటు మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును సర్వనాశనం చేస్తోందని హెచ్చరిస్తున్నారు ఆచార్య చాణక్యుడు. విజయానికి కేవలం శ్రమ మాత్రమే చాలదు; సరైన వ్యూహం, గోప్యత, సంయమనం అత్యంత కీలకమని చాణక్య నీతి స్పష్టం చేస్తోంది.
ఒకే ఒక్క శ్లోకం.. జీవితాన్ని మార్చే తిరుగులేని మంత్రం
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకం నేటి ఆధునిక కాలానికి కూడా అక్షరాల సరిపోతుంది.
‘మనసా చింతితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్ |
మంత్రేణ రక్షయేద్ గూఢం కార్యే చాపి నియోజయేత్ ॥’
దీని సారాంశం ఏంటంటే.. మీ మనసులో అనుకున్న లక్ష్యాన్ని గానీ, భవిష్యత్ ప్రణాళికను గానీ అది పూర్తయ్యేంతవరకు ఏ ఒక్కరి ముందూ నోరు విప్పి చెప్పకండి. అత్యంత రహస్యంగా మీ వ్యూహాలను రక్షించుకుంటూ, మౌనంగా క్షేత్రస్థాయిలో పనిని పూర్తి చేయడమే నిజమైన విజేత లక్షణం.
సోషల్ మీడియా పిచ్చి.. లక్ష్యాలకు గండి
నేటి డిజిటల్ యుగంలో చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు.. ఏదైనా చిన్న ఆలోచన రాగానే ఊదరగొట్టడం. కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా, కెరీర్లో పెద్ద మలుపు తీసుకోవాలనుకున్నా, సరికొత్త ప్రాజెక్ట్ ఆలోచన ఉన్నా.. ఆచరణలోకి రాకముందే డప్పు కొట్టేస్తుంటారు. చాణక్యుడి అభిప్రాయంలో ప్రకారం ఇది మీ కలలను మీరే నాశనం చేసుకోవడంతో సమానం లాంటిది. మీరు ముందే మీ ఆలోచనలను బయటపెట్టడం వల్ల కలిగే నష్టాలివే అని చాణక్య నీతి చెబుతుంది.
1. నెగెటివ్ ఆలోచనలు : మీ ప్లాన్ గురించి చెప్పగానే నలుగురి నుంచి నాలుగు రకాల ఉచిత సలహాలు, విమర్శలు, నెగెటివ్ కామెంట్లు ఎదురవుతాయి. “నీ వల్ల కాదులే”, “ఇప్పుడు అవసరమా?” అంటూ మీ మనోధైర్యాన్ని దెబ్బతీస్తారు. దీంతో స్టార్టింగ్‌లో మీ ఏకాగ్రత చెల్లాచెదురవుతుంది.
2. శత్రువుల ఎత్తుగడలు: మీ వ్యూహం అమలు కాకముందే లీక్ కావడంతో, మార్కెట్లో ఉన్న మీ ప్రత్యర్థులు లేదా మీకు పడనివారు వెంటనే అలర్ట్ అవుతారు. మీ ఐడియాను కాపీ కొట్టడమో, లేదా మీ రూట్లో అడ్డంకులు సృష్టించడమో చేస్తారు.
3. మెదడు పొందే భ్రమ: లక్ష్యం గురించి పదేపదే ఇతరులతో మాట్లాడినప్పుడు.. ఆ పని ఇప్పటికే పూర్తయిపోయినట్లు మెదడులో తృప్తి భావన (డొపమైన్ రిలీజ్) కలుగుతుంది. దీనివల్ల వాస్తవంగా కష్టపడాల్సిన శక్తి, ఉత్సాహం క్రమంగా క్షీణించి మాటలకే పరిమితమైపోతారు.
చాణక్యుడి సందేశం ఇదే: పని పూర్తయ్యే వరకు పెదవి విప్పకండి. శక్తిని మాటల రూపంలో వృధా చేయకుండా, పని రూపంలోకి మళ్లించండి. మీ వ్యూహాలు నిశ్శబ్దంగా అమలు కావాలి; ఫలితం వచ్చినప్పుడు దాని ప్రభావం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా ఉండాలి. గుర్తుంచుకోండి.. విజేత ఎప్పుడూ తన ప్లాన్‌ను ముందే ప్రకటించడు. పని పూర్తి చేసి ఫలితాన్ని మాత్రమే చూపిస్తాడు. ఈ రోజు నుంచే మీ ఆలోచనలను అత్యంత రహస్యంగా ఉంచండి.. మీ శ్రమ మౌనంగా సాగనీయండి.. మీ సక్సెస్ చేసే శబ్దమే ఇతరులకు సమాధానం కావాలి.
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!