Encounter: జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఎన్కౌంటర్.. కథువా ఉగ్రదాడి తర్వాత ఘటన..
- జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్..
- దోడా జిల్లాలో భద్రతా సిబ్బంది - ఉగ్రవాదులకు మధ్య కాల్పులు..
- కథువా ఉగ్రదాడి తర్వాత రోజే మరో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Encounter: జమ్మూ కాశ్మీర్ వరస ఉగ్ర ఘటనలతో అట్టుడికిపోతోంది. తాజాగా దోడా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. నిన్న కథువాలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేసి ఐదుగురు జవాన్ల మరణాలకు కారణమయ్యారు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత జమ్మూ లోని దోడా జిల్లాలో తాజా ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
Read Also: BJP: “బెంగాల్లో మరో తాలిబాన్ వీడియో”.. తృణమూల్ అరాచకాలపై రాహుల్ గాంధీ మౌనం ఎందుకు..?
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
కథువా ఘటన 48 గంటల్లో ఆర్మీపై జరిగిన రెండో దాడి. అంతకుముందు రాజౌరీలోని సైనిక శిబిరంపై ఆదివారం ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిని సైన్యం తిప్పికొట్టింది. దీంట్లో ఒక సైనికుడు గాయపడ్డాడు. ఆ తర్వాతి రోజు సోమవారం కథువాలో పెట్రోలింగ్ పార్టీపై, ఉగ్రవాదులు అడవుల్లో నక్కి గ్రెనెడ్స్ విసిరి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. కథువా ఘటన జరిగిన తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఘటనకు పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కి సన్నిహితంగా ఉన్న కాశ్మీర్ టైగర్స్ బాధ్యత ప్రకటించుకుంది.
60 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు, జింగిల్ వార్ఫేర్లో శిక్షణ పొంది జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్నారు. గత నెల కాలం నుంచి రాజౌరీ, కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాద దాడులు జరిగాయి. గత నెలలో ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తున్న రోజే, కథువా జిల్లాలో శివ్ ఖోరీ నుంచి కత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 10 మంది మరణించారు. జమ్మూ ప్రాంతంలోని కథువా, రాజౌరీ, దోడా జిల్లాల్లోని దట్టమైన అడవులు, కొండలు, లోయలు ఉగ్రవాదులకు అనుకూలంగా ఉన్నాయి. ఈ అడవులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి కొనసాగుతుండటంతో ఉగ్రవాదులకు అడ్డాగా మారింది.
తాజావార్తలు
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!