Emergency: “ఎమర్జెన్సీ” విధించిన రోజుని ‘సంవిధాన్ హత్యా దివాస్’గా పాటించాలని కేంద్రం నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emergency: 1975, జూన్ 25న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ‘ఎమర్జెన్సీ’ విధించారు. అయితే ఈ జూన్ 25వ తేదీని ‘‘సంవిధాన్ హత్యా దివాస్’’( రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు)గా పాటిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అమానవీయ బాధలను భరించిన వారందరి ధైర్యాన్ని జూన్ 25న స్మరించుకోవాలని అమిత్ షా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘జూన్ 25, 1975న, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, నియంతృత్వ ఆలోచనా ధోరణిని ప్రదర్శించి, దేశంపై ఎమర్జెన్సీని విధించడం ద్వారా మన ప్రజాస్వామ్యం యొక్క ఆత్మపై దాడి చేశారు. ప్రతీ ఏడాది జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివాస్’గా పాటించాలి’’ అని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు తన ట్వీట్లో పేర్కొన్నారు.
Read Also: Bharateeyudu 2: విజయ్ మాల్యా, గాలి జనార్దన్ రెడ్డిలను టచ్ చేసిన శంకర్?
Also Read
ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ‘ సంవిధాన్ బచావో’ అంటూ బీజేపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. 18వ లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఇండియా కూటమి నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగాన్ని చేతబూని ప్రమాణస్వీకారం చేశారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నుంచి తన చేతిలో రాజ్యాంగ ప్రతిని వెంట పెట్టుకుంటున్నారు. అయితే, దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ నేత, దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ‘ఎమర్జెన్సీ’ విధించిన విషయాన్ని బీజేపీ హైలెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జూన్ 25ని రాజ్యాంగాన్ని హత్య చేసిన దినంగా ప్రకటించింది.
"On June 25, 1975, the then PM Indira Gandhi, in a brazen display of a dictatorial mindset, strangled the soul of our democracy by imposing the Emergency on the nation. Lakhs of people were thrown behind bars for no fault of their own, and the voice of the media was silenced.… pic.twitter.com/B1EEjITlWL
— ANI (@ANI) July 12, 2024
తాజావార్తలు
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్‌పై 6-0 భారీ విజయం.!
-
Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
-
Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!