PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పీఎం మోడీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. జూన్ 19, 1970న ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో జన్మించిన రాహుల్ గాంధీ.. నేటితో 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోడీతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందజేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ రాహుల్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. రాజ్యాంగ ఆదర్శాల పట్ల రాహుల్ గాంధీకి ఉన్న అచంచలమైన నిబద్ధత, సమాజంలో అణచివేయబడిన వారి గొంతుకగా నిలుస్తూ చేస్తున్న పోరాటం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోందని ఖర్గే కొనియాడారు.
అందరినీ కలుపుకునిపోయే కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం, సామాజిక న్యాయం, సామరస్యం, కరుణ వంటి గుణాలు రాహుల్ గాంధీ నాయకత్వంలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయని ఖర్గే పేర్కొన్నారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, అధికార పీఠం ముందు నిజాన్ని మాట్లాడే ధైర్యం ఉన్న నాయకుడిగా సమాజంలో వెనుకబడిన, బలహీన వర్గాల ప్రయోజనాల కోసం రాహుల్ ఎల్లప్పుడూ గళం విప్పారని గుర్తుచేశారు. దేశ సేవలో ఉన్న రాహుల్ గాంధీకి భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, సంతోషాన్ని, మరింత శక్తిని ప్రసాదించాలని ఖర్గే ఆకాంక్షించారు.
Also Read
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
Best wishes to the Leader of the Opposition in the Lok Sabha, Shri Rahul Gandhi Ji on his birthday. Praying for his good health and long life. @RahulGandhi
— Narendra Modi (@narendramodi) June 19, 2026
తాజావార్తలు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!