Elon Musk: ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా రికార్డు సృష్టించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి టెక్ ఆంత్రప్రెన్యూర్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ విషెస్ తెలిపారు. అత్యధిక ఫాలోవర్లతో ఉన్న ప్రధాని మోడీకి కంగ్రాట్స్ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జులై 14వ తేదీన ఎక్స్‌లో మోడీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లు దాటింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీనే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతటి ఉత్సాహభరిత వేదికలో ఉండటం తనకెంతో ఆనందమన్నారు. ఈ వేదికగా జరిగే చర్చలు, నిర్మాణాత్మక విమర్శలు, ప్రజలు ఇచ్చే దీవెనలు ఎంతో ఇష్టమని వెల్లడించారు.
Read Also: Telangana: దంచికొడుతున్న వానలు.. ఉప్పొంగుతున్న ప్రాజెక్టులు
ఇక, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్టు ప్రధాని మోడీకి ఎలాన్ మస్క్ కామెంట్ చేశారు. ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు అందరినీ మించి మోడీ ఫాలోవర్లను దక్కించుకున్నారు. గ్లోబల్ సెలబ్రిటీలైన టేలర్ స్విఫ్ట్ (95.3 మిలియన్ ఫాలోవర్స్), లేడీ గాగా (83.1 మిలియన్స్), కిమ్ కర్డేషియన్ (75.2 మిలియన్స్) లను సైతం మోడీ మించిపోయారు. ఇక, ప్రపంచ రాజకీయ నేతలు ఎవరూ కూడా నరేంద్ర మోడీ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. దుబాయ్ అధ్యక్షుడు షేక్ ముహమ్మద్‌కు 11.2 మిలియన్స్ ఫాలోవర్లు, పోప్ ఫ్రాన్సిస్‌కు 18.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక, క్రికెట్ ప్రపంచ స్టార్లు విరాట్ కోహ్లీ (64.1 మిలియన్స్), ఫుట్‌బాల్ స్టార్ నేమార్ జూనియర్ (63.6 మిలియన్), బాస్కెట్ బాల్ ప్లేయర్ లిబ్రాన్ జేమ్స్ (52.9 మిలియన్లు) కూడా వెనకబడే ఉండిపోయారు.
Read Also: Holidays: ఏపీలో భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు..
అయితే, గత మూడేళ్లల్లోనే నరేంద్ర మోడీ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 30 మిలియన్లకు పైగా పెరిగింది. 2009లో ఎక్స్‌లో చేరిన మోడీకి నాటి నుంచీ తన ఫాలోవర్లతో ప్రతి రోజు టచ్‌లో ఉంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందిరికీ ఎక్స్ వేదికగా సమాధానం ఇస్తూ.. ఎవరినీ బ్లాక్ చేయకుండా తన దైన శైలిలో నెటిజన్స్ అభిమానాన్ని నరేంద్ర మోడీ చూరగొంటున్నారు.
Congratulations PM @NarendraModi on being the most followed world leader!
— Elon Musk (@elonmusk) July 19, 2024