Eknath Shinde: ఫడ్నవీస్ అరెస్ట్‌కి కుట్ర చేసిన ఉద్ధవ్ ప్రభుత్వం.. సీఎం సంచలన ఆరోపణ..
- ఫడ్నవీస్ అరెస్ట్‌కి అప్పటి ఎంవీఏ ప్రభుత్వం కుట్ర..
- బీజేపీని అణిచేందుకు ఉద్ధవ్ సర్కార్ ప్లాన్..
- సంచలన ఆరోపణలు చేసిన సీఎం ఏక్‌నాథ్ షిండే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇదిలా ఉంటే, సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గతంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్‌ని అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. బీజేపీని అణగదొక్కేందుకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంవీఏ కూటమిలో చేరడానికి చేసిన ప్లాన్ అని షిండే అన్నారు.
Read Also: Jaganmatha Stotram: శ్రావణ మంగళవారం జగన్మాత స్తోత్రాలు వింటే 100 రెట్ల ఫలితాన్ని పొందుతారు
Also Read
- Vladimir Putin: "రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు".. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
- Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘ వారు ప్రతీది ప్లాన్ చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ని అరెస్ట్ చేస్తారని చెప్పినప్పుడు నేను అభ్యంతరం చెప్పాను. ఇది బీజేపీని వెనుకడుగు వేసేలా చేయొచ్చు. వారి ఎమ్మెల్యేలు ఎంవీఏలో చేరొచ్చు’’ అని షిండే అన్నారు. తనకు అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఈ కుట్రతో ఎంవీఏ ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు నిశ్చయించుకుందని చెప్పారు. బీజేపీపై ప్రతీకారానికి వారు ఈ మార్గాన్ని సమర్థించారని చెప్పారు.
అర్బన్ ల్యాండ్ కేసులో నన్ను కూడా ఇరికించాలని ప్రయత్నించారని, కొంత మంది అధికారుల నుంచి ఈ విషయం గురించి తెలిసిందని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్లాన్ గురించి మొత్తం తెలుసుకున్నానని అన్నారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ వ్యవహారాల్లో తన కుటుంబ సభ్యుల అనవసర జోక్యాన్ని అనుమతించారని షిండే విమర్శించారు. దీని వల్ల ఠాక్రే ప్రవర్తన మరింత అస్థిరంగా మారిందని, అతనికి అయోమయం, విచారం కలిగిందని అన్నారు. పార్టీ పట్ల అంకిత భావం ఉన్నప్పటికీ రాజ్ ఠాక్రేని అన్యాయంగా పక్కన పెట్టేశారని, ఇది బాలా సాహెబ్ ఠాక్రే కోరికకు విరుద్ధంగా ఉందని షిండే చెప్పారు. బాలా సాహెబ్ ఠాక్రే రాజ్ ఠాక్రేని విడిచిపెట్టాలని ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు.
తాజావార్తలు
-
Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
-
Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
-
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్‌లైన్‌కు నష్టం!
-
Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?