Sanjay Raut: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: ముంబైలోని పత్రాచాల్ భూకుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆదివారం ఆయన నివాసంలో గంటల కొద్దీ దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు కూడా రౌత్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహించింది. ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సీఐఎస్‌ఎఫ్ అధికారులతో పాటు ఈడీ బృందం రౌత్ నివాసానికి చేరుకుంది. రూ.1,034 కోట్ల పత్రాచాల్ భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నోటీసులు అందుకున్న ఆయన.. విచారణకు హాజరుకాలేదు. జులై 27న ఈడీ ఈడీ కార్యాలయానికి రావాలని కోరగా.. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో హాజరు కాలేనని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు ఆయన ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది.
పత్రాచాల్ భూకుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలపై సంజయ్ రౌత్ ట్విటర్ వేదికగా స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలదేన్నారు. ‘‘ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదు. చనిపోయినా సరే.. నేనెవరికీ తలొగ్గబోను. నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నాను. బాలాసాహెబ్ మాకు ఎలా పోరాడాలో నేర్పారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా’’ అని ట్వీట్ చేశారు.
Also Read
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
మరోవైపు రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ తప్పూ చేయకపోతే.. ఈడీ విచారణకు రౌత్ ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్యే రామ్ కడం ప్రశ్నించారు. విలేకరుల సమావేశం నిర్వహించడానికి సమయం ఉన్నప్పుడు ఈడీ ముందుకు వెళ్లడానికి ఎందుకు లేదని నిలదీశారు. సంజయ్ రౌత్‌ను జులై 1న ఈడీ అధికారులు దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించారు. తర్వాత మరో రెండు సార్లు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన హాజరు కాలేదు.
Regional Parties: దేశంలోని 54 ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో నంబర్-1గా జేడీయూ
ఏప్రిల్‌లో, ఈ దర్యాప్తులో భాగంగా రౌత్ భార్య వర్షా రౌత్, అతని ఇద్దరు సహచరులకు చెందిన రూ.11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తులు పాల్ఘర్, సఫాలే (పాల్ఘర్‌లోని పట్టణం), పద్ఘా (థానే జిల్లాలో) వద్ద సంజయ్ రౌత్ సహాయకుడు, గురు ఆశిష్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అయిన ప్రవీణ్ ఎం రౌత్ ఆధీనంలో ఉన్న భూమి రూపంలో ఉన్నాయి. ముంబయి శివారులోని దాదర్‌లోని వర్షా రౌత్‌కు చెందిన ఫ్లాట్‌తోపాటు అలీబాగ్‌లోని కిహిమ్ బీచ్‌లో వర్షా రౌత్, సుజిత్ పాట్కర్ భార్య స్వప్నా పాట్కర్ సంయుక్తంగా కలిగి ఉన్న ఎనిమిది ప్లాట్లు కూడా అటాచ్ చేసిన ఆస్తుల్లో ఉన్నాయని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.1,034 కోట్ల పత్రాచాల్ భూకుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
తాజావార్తలు
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
-
Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
-
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!