Andaman Nicobar Earthquake: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రత నమోదైంది. భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. గతవారం కూడా అండమాన్ దీవుల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం తెల్లవారుజామున 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. తెల్లవారుజామున 4.17 గంటలకు భూకంపం సంభవించిందనీ, భూకంప కేంద్రం 61 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉందని భూకంప కేంద్రం తెలిపింది. కాగా అండమాన్-నికోబార్ ద్వీప ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ఆల్పైన్-హిమాలయ భూకంప బెల్ట్ ప్రపంచంలోని భూకంప చురుకైన బెల్ట్లలో ఒకటిగా ప్రసిద్ది చెందింది. భూకంపాలు తరచుగా ద్వీపసమూహాన్ని తాకుతాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Read also: Ustaad Bhagat Singh :వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలనీ చూస్తున్న దర్శకుడు హరీష్ శంకర్..?
గతవారంలో కూడా అండమాన్ దీవుల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. గత శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్ లోని పాంగిన్ ఉత్తర దిశలో రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ట్విటర్ లో తెలిపింది. ఉదయం 8.50 గంటలకు భూప్రకంపనలు సంభవించాయని పేర్కొంది. ఎన్సీఎస్ వివరాల ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 8.50 గంటలకు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ భూకంపం గురించి పేర్కొంటూ.. శుక్రవారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాలోని పాంగిన్ పట్టణంలో రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది.