పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం..అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు వున్నాయి.. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను ఎప్పుడో స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసారు. కానీ ఆ సినిమా షూటింగ్ వెంటనే వాయిదా పడింది.కేవలం 10 రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకోగా ఆ చిన్న షెడ్యూల్ తోనే హరీష్ పవన్ పై అదిరిపోయే గ్లింప్స్ ను కూడా విడుదల చేసి ఎంతగానో ఆకట్టుకున్నాడు.. పవన్ మళ్ళీ వారాహి యాత్ర లో బిజీ అవ్వడంతో ఈ సినిమా ఇప్పటి వరకు మళ్ళీ మొదలు అవ్వలేదు.
చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ పవన్-హరీష్ కాంబో లో సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అదేమిటంటే ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అతి త్వరలోనే ఈ సినిమా తరువాత షెడ్యూల్ షూట్ ను కూడా మేకర్స్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం.. ఈ షూటింగ్ మొదలైతే ఎంతో ఫాస్ట్ గా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట హరీష్.ఈ సినిమాను స్పీడ్ గా పూర్తి చేసి 2024 సంక్రాంతికి పక్కాగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాకు డేట్స్ కేటాయించారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.