Earthquake: అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్‌సీఎస్) ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రోజు రాత్రి 7.36 గంటలకు 120 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని వెల్లడించింది. దీనికి ముందు గురువారం జమ్మూ కాశ్మీర్ లోని దోడాలో 3.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Earthquake: ఈ రోజు తెల్లవారుజామున అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడిచింది. అండమాన్ సముద్రంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
మరోసారి వరుస భూకంపాలు వణికిస్తున్నాయి.. నిన్న నేపాల్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది.. దాదాపు 10 మంది వరకు మృతిచెందినట్టు తెలుస్తోంది.. నేపాల్‌లో భూకంపం సంభవించడంతో భారత రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. బుధవారం తెల్లవారు జామున 1.57 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 6.3తీవ్రతగా నమోదైంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, గుడ్‌గావ్ ప్రాంతాల్లో పది సెకన్ల పాటు ప్రకంపనలు రాగా.. ఏం…
Chief Secretary physical assault on woman In Andaman and Nicobar: అండమాన్-నికోబార్ దీవుల మాజీ చీఫ్ సెక్రటరీతో పాటు మరో అధికారి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లు 21 ఏళ్ల మహిళ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నరైన్, లేబర్ కమిషనర్ ఆర్ఎల్ రిషిలు తనపై రెండు సార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సదరు బాధిత మహిళ…
భారత సైన్యం అమ్ములపొదిలోని శక్తిమంతమైన ఆయుధంగా పరిగణించే బ్రహ్మోజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. బుధవారం భారత ఆర్మీ అధికారులు ఈ క్షిపణిని అండమాన్ నికోబార్ దీవుల్లో విజయవంతంగా పరీక్షించారు. రష్యా సహకారంతో డీఆర్‌డీవో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణితో భూతలం నుంచి భూతలానికి, భూమి నుంచి యుద్ధ విమానాలు, యుద్ద నౌకల వంటి టార్గెట్లను ధ్వంసం చేయవచ్చు. తాజాగా బ్రహ్మోస్ మిస్సైల్ రేంజ్ పెరగ్గా.. ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా…
త్వరలో అండమాన్ నికోబార్‌లో జరగనున్న మునిసిపల్, పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఏఎన్‌టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ బుధవారం పోర్టు బ్లెయిర్‌లో గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా పోర్టు బ్లెయిర్ మునిసిపాలిటీలోని 2, 5, 16 వార్డుల్లో టీడీపీ పోటీ…