NTV Telugu Site icon

Udayanidhi Stalin: మా టార్గెట్ కేంద్రమే.. ఉదయనిధి స్టాలిన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు..

Udayanidhi

Udayanidhi

Udayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన సమగ్ర శిక్ష అభియాన్‌ కి వచ్చే 2190 కోట్ల రూపాయల నిధులు తామేమీ అ‍డుక్కోవడం లేదని పేర్కొన్నారు. మీ అయ్యా సొమ్ము ఏం అడగడం లేదని విమర్శలు గుప్పించారు. మేమేమీ మీ తండ్రి సంపాదించిన డబ్బులు అడగడం లేదని చెప్పుకొచ్చారు. మాకు న్యాయంగా రావాల్సిన నిధులే మేం అడుగుతున్నామన్నారు. తమిళనాడు ప్రజలు కట్టే పన్ను డబ్బులనే మేం అడుతున్నాం అని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.

Read Also: Electric Shock: శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి.. 13 మందికి కరెంట్ షాక్

ఇక, భారతీయ జనతా పార్టీ బెదిరింపులకు భయపడేదే లేదు అని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. తమిళనాడుపై హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తున్నారు.. రాష్ట్రంలోని రెండు భాషల పాలసీ ప్రస్తుతం ప్రమాదంలో పడిందని తెలిపాడు. ఫాసిస్టు బీజేపీపై ఈ విషయంలో పోరాటం చేసేందుకు ప్రతిపక్షం అన్నాడీఎంకే మాతో కలిసి రావాలి అని ఆయన కోరారు. తమిళనాడు రాష్ట్ర ప్రజలను కమలం రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని చూస్తోందని అతడు మండిపడ్డారు.

Read Also: Komatireddy Venkat Reddy: ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ

అయితే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ) కింద మూడు భాషల పాలసీని అమలు చేసే వరకు తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్‌ కింద నిధులు ఇచ్చేది లేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఇటీవలే స్పష్టం చేయడంతో.. ఈ విధంగా ఉదయనిధి స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. గతంలోనూ సనాతన ధర్మంపై అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం మనకు తెలిసిందే.