అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు పెమా ఖండూని తమ నేతగా మరోసారి ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.
రాష్ట్రపతి అంటే దేశ ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు అని అర్థం. అందుకే రాష్ట్రపతి పదవిని అత్యున్నత పదవిగా అందరూ భావిస్తారు. అలాంటి అత్యున్నత పదవిని గిరిజన మహిళ ద్రౌపది ముర్ము సొంతం చేసుకున్నారు.