Pappu Yadav: ఇటీవల ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిసిన సమయంలో మటన్ తో విందు చేసిన నేపథ్యంలో వారిపై బీజేపీ నేత సుశీల్ మోడీ విమర్శలు గుప్పించారు. పవిత్రమైన శ్రావన మాసంలో మటన్ లో విందు ఏంటని..? ప్రశ్నించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై జన్ అధికార్ పార్టీ (జేఏపీ) చీఫ్ పప్పూ యాదవ్ మంగళవారం విరుచుకుపడ్డారు. సుశీల్ మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
మంగళవారం, బుధవారాల్లో, శ్రావణ మాసంలో నాన్-వెజ్ తినడం మానేస్తారా..? అని సుశీల్ భాయ్ ని అడగండి, నాయకులు పోర్న్ చూడటం మానేస్తారా..? అది కూడా నాన్-వెజ్ కాదా..? మద్యం సేవించడం నాన్-వెజ్ కాదా..? కులం ఆధారంగా వివక్ష చూపడం నాన్ వెజ్ కాదా..? సుశీల్ భాయ్ మీరు మీ మొబైల్ చెక్ చేసుకోండి.. మీరు శ్రావణ మాసంలో పోర్న్ చూశారో లేదో తెలుస్తుంది..? అంటూ పప్పూ యాదవ్ విలేకరుల సమావేశంలో విరుచుకుపడ్డారు.
Read Also:Xi Jinping: ఈ 5 కారణాల వల్లే జిన్‌పింగ్ ఇండియాకు రావడం లేదా..?
అంతకుముందు లాలూ ప్రసాద్ మటన్ తినడంపై సుశీల్ మోడీ విమర్శరించారు. లాలూ శ్రావణ మాసంలో మటన్ తిన్నారని.. అందుకే ఆయన చేసిన రాజకీయ పాపాలకు వచ్చే ఎన్నికల్లో శిక్ష తప్పదని, కొత్త పార్లమెంలట్ ముఖాన్ని ఆర్జేడీ చూడదని ఆయన వ్యాఖ్యానించారు. ముంబాయిలో ఇండియా కూటమి సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ చీఫ్ లాలూ మధ్య జరిగిన విందు సమావేశానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ సమావేశంలో లాలూ చంపారన్ మటన్ వంటకాన్ని రాహుల్ గాంధీకి నేర్పించారు. ఢిల్లీలోని ఆయన కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి నివాసంలో లాలూ ప్రసాద్ యాదవ్ మరియు ఆయన కుటుంబ సభ్యులు రాహుల్‌కి ఆతిథ్యం ఇచ్చారు.