Udhayanidhi Stalin: డీఎంకే పార్టీ యువనేత, ఆ రాష్ట్ర మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో కోయంబత్తూర్ లో ఆదివారం సామూహిక వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయనిధి హాజరయ్యారు. సీఎం ఎంకే స్టాలిన్ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ ఖర్చుతో 81 జంటలకు పెళ్లి జరిపించారు.