Gas Prices Hike: మరోసారి వంటగ్యాస్ ధరలను వడ్డించేశారు.. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50 పెంచేశారు.. ఇక వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా రూ.350.50 పెరిగింది.. దేశవ్యాప్తంగా నేటి నుంచి పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు అమల్లోకి వచ్చేశాయి.. 14.2 కిలోల డొమెస్టిక్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ ధర రూ.50 పెరగడంతో.. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1,103కి చేరింది.. ఇక, హైదరాబాద్‌లో 14.2 కిలోల ఎల్‌పీజీ ధర రూ.1,155కి పెరిగింది.. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులను బట్టి ఈ రేట్లు మారుతూ ఉంటాయి.
Read Also: CM YS Jagan Nidadavolu Tour: నేడు నిడుదవోలుకు సీఎం జగన్
మరోవైపు.. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.350.50 పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2119.50కు చేరింది.. చమురు సంస్థలు వడ్డించిన ఈ కొత్త రేట్లు నేటి నుంచి అమలులోకి రానున్నాయి.. ఇక, దేశీయ వంట గ్యాస్ ధరలు స్థానిక పన్నుల కారణంగా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. ఇంధన రిటైలర్లు ప్రతి నెల ప్రారంభంలో ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తూ వస్తున్నారు.. ప్రతి కుటుంబానికి ఏడాదికి 14.2 కిలోల 12 సిలిండర్లు సబ్సిడీ ధరలకు అందజేస్తున్నారు.. అంతకు మించి వినియోగిస్తే.. సదరు వినియోగదారులు మార్కెట్ ధరలో ఎల్‌పిజి సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. PAHAL (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ LPG) పథకం కింద, వినియోగదారులు సబ్సిడీ రేటుతో ఎల్‌పీజీ సిలిండర్‌లను పొందుతారు. సబ్సిడీ విదేశీ మారకపు రేట్లు, ముడి చమురు ధరలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి..