DMK: వెన్నుపోటుదారుడు, అతను బీజేపీకే లాభం.. రాహుల్ గాంధీపై డీఎంకే దాడి..

  • రాహుల్ గాంధీపై డీఎంకే అధికార పత్రిక మురసోలి తీవ్ర విమర్శలు.
  • తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపణ.
  • కేరళ ప్రచారంలో పినరయిపై చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఫైర్..
Stalim Rahul Gandhi

Stalim Rahul Gandhi

DMK: ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా కాంగ్రెస్, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల సీపీఎం నేత, మాజీ సీఎం పినరయి విజయన్ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. ఆయన వల్ల బీజేపీకి లాభం చేకూరుతోందని విమర్శించారు. తాజాగా, డీఎంకే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమిలో పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్నికల అనంతరం విజయ్‌తో చేతులు కలిపింది. ఈ పరిణామాలపై డీఎంకే పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షత వహించిన ఇండియా కూటమి సమావేశానికి కూడా డీఎంకే వెళ్లలేదు.

ఇడిలా ఉంటే, డీఎంకే అధికారిక పత్రిక మురసోలిలో రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ పార్టీ డీఎంకేను వెన్నుపోటు పొడించిందని ఆరోపించింది. రాహుల్ గాంధీ వల్లే ఇలాంటి రాజకీయ పరిణామాలు జరిగాయని చెప్పింది. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని డీఎంకే తప్పుపట్టింది. పినరయి విజయన్‌, ప్రధాని మోడీ మధ్య రహస్య ఒప్పందం ఉందని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్ని వామపక్షాలు ఖండించాయి.

×
×
Ad

ఇండియా కూటమిలో అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కూడా కాంగ్రెస్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిందని మురసోలి పేర్కొంది. డీఎంకే, ఆప్ వంటి కీలక మిత్రపక్షాలు దూరం కావడం ఇండియా కూటమిలో ప్రతిపక్షాల ఐక్యతకు పెద్ద దెబ్బగా అభివర్ణించింది. బీహార్‌లో అనేక అంశాలపై కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకుల మధ్య రహస్య అవగాహనలు ఉన్నాయేమోనని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ అనుమానాలు వ్యక్తం చేశారని, ఈ విషయాన్ని ప్రస్తావిస్తే కాంగ్రెస్ నుంచి సరైన మద్దతు రాలేదని మురసోలి ఆరోపించింది.

ఇండియా కూటమి సమావేశంలో బీజేపీ వ్యతిరేక కన్నా కాంగ్రెస్ వ్యవహారశైలి పైనే అసంతృప్తి ఎక్కువగా ఉందనే వార్తలు వినిపించాయి. రాహుల్ గాంధీ అపరిపక్వత, మిత్రపక్షాలతో వ్యవహరించే తీరు కారణమని డీఎంకే అధికారిక పత్రిక ఆరోపించింది. కూటమిలో విభేదాలకు బాధ్యత రాహుల్ గాంధీ తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాహుల్ తీరు వల్ల బీజేపీకే లాభం చేకూరుతోందని మురసోలి అభిప్రాయపడింది.