DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- కాంగ్రెస్ తీరుపై డీఎంకే ఆగ్రహం..
- పొత్తు ధర్మాన్ని పాటించలేదని గరం గరం..
- కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- డీఎంకే నేత టీఆర్ బాలు సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే విజయ్ టీవీకే పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. డీఎంకే కూటమిలో భాగంగా ఉన్న హస్తం పార్టీ ప్లేటు ఫిరాయించింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. కాంగ్రెస్ తీరును ‘‘ద్రోహపూరితగ చర్య’’గా అభివర్ణించింది. ఓటమి, ద్రోహం తమకు కొత్త కాదని, ఇవి రెండూ శాశ్వతం కాదని, దీనికి కాలమే సరైన సమాధానం చెబుతుందని డీఎంకే చెబుతోంది.
కష్టసుఖాల్లో కాంగ్రెస్‌కు తాము అండగా నిలిచామని డీఎంకే పార్టీ గుర్తు చేసింది, ఇప్పుడు ఆ పార్టీ టీవీకేకు మద్దతు ఇవ్వడంపై ‘‘అవకాశవాదులు’’ అని ఆరోపించింది. “కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులను లేదా సంక్షోభాలను ఎదుర్కొందో, అప్పుడు డీఎంకే ఒక దృఢమైన మిత్రపక్షంగా వారికి అండగా నిలిచింది. ఈ విధేయత కోసం మేము చెల్లించిన మూల్యం చాలా ఎక్కువ, అయినా సరే, మేము దానిని చిరునవ్వుతో భరించాము,” అని డీఎంకే కోశాధికారి టీఆర్ బాలు అన్నారు. కూటమిలో ఉంటేనే కాంగ్రెస్ 5 స్థానాలు గెలిచిందని ఆయన గుర్తు చేశారు.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
Read Also: Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
కాంగ్రెస్ చర్యను గొప్ప రాజకీయ వ్యూహంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోందని, అవకాశవాదాన్ని సిద్ధాంతం అనే ముసుగులో కప్పిపుచ్చాలని చూస్తోందని, ఇది అవకాశవాద సిద్ధాంతం అని, డీఎంకే కూటమికి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇది బహిరంగ ద్రోహచర్యగా పరిగణించబడుతుందని బాలు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అధికారంలో కోసం బీజేపీ ఏం చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే చేస్తోందని అన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళనాడులోని 234 స్థానాలకు గానూ టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది. అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి మరో 10 స్థానాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కాంగ్రెస్ 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ, విజయ్ మెజారిటీకి దూరంగానే ఉన్నారు. వీసీకే, వామపక్షాలు కానీ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో, తమిళనాడులో నెంబర్ గేమ్ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!