Disha Salian: “దిశా సాలియన్”పై గ్యాంగ్ రేప్.. “ఆదిత్య ఠాక్రే”పై విచారణ కోరుతూ తండ్రి పిటిషన్..
- మరోసారి తెరపైకి దిశా సాలియన్ కేసు..
- ఆదిత్య ఠాక్రేపై దిశ తండ్రి పిటిషన్..
- దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుతో సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disha Salian: దివంగత బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, అతడి మాజీ మేనేజర్‌గా పని చేసిన దిశా సాలియన్ మరణం మరోసారి తెర పైకి వచ్చాయి. దిశా సాలియన్ ముంబైలోని ఓ అపార్ట్మెంట్లోని 14వ అంతస్తు నుంచి అనుమానాస్పదంగా పడి చనిపోయింది. ఇది జరిగిన ఆరు రోజులకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దిశా సాలియన్ మరణించి 5 ఏళ్ల తర్వాత ఆమె తండ్రి శివసేన(ఠాక్రే) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. అయితే, దీనిపై ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం తన పరువు తీయడానికి కోర్టులో ఈ కేసును వేశారని ఆరోపించారు.
సతీష్ సాలియన్ న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ జూన్ 8, 2020న సబర్బన్ మలాడ్‌లోని ఒక ఎత్తైన భవనం యొక్క 14వ అంతస్తు నుండి పడి దిషా మరణించాడు. ఆ తర్వాత పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR) కేసును నమోదు చేశారు. ఆరు రోజుల తర్వాత, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన బాంద్రా ఫ్లాట్‌లో చనిపోయాడు. పోలీసులు మొదట దీనిని ఆత్మహత్య కేసు అని చెప్పారు. ఆ తర్వాత దీనిని సీబీఐకి అప్పగించారు.
Also Read
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్‌కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
Read Also: Meerut Murder: ‘‘నాన్న డ్రమ్‌లో ఉన్నాడు’’.. తండ్రి హత్య గురించి పక్కింటి వాళ్లకు చెప్పిన పాప..
2020లో, సతీష్ సాలియన్ తన కుమార్తె మరణంలో ఎవరిపైనా అనుమానాలు లేవని, దర్యాప్తుతో పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, ఇటీవల దిశా తండ్రి సతీష్ సాలియన్ తన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశారు. జూన్ 08, 2020లో దిశా తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించిందని, దానికి ఆదిత్య ఠాక్రే, సూరజ్ పంచోలి, డినో మోరియా తదితరులు హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనాలను ఉటంకిస్తూ.. దిశాపై సామూహిక అత్యాచారం జరిగిందని, బలవంతంగా నిర్బంధించడం, క్రూరమైన లైంగిక దాడికి గురైందని తన పిటిషన్లో పేర్కొన్నారు. దిశా ఎత్తైన భవనం నుంచి పడినప్పటికీ, ఆమె శరీరంపై ఒక్క బలమైన గాయం కూడా లేదని, సంఘటనా స్థలంలో రక్తం లేదని పిటిషన్లో ఆరోపించారు.
అప్పటి రాజకీయ నాయకుల ఒత్తిడితో, నిందితులను రక్షించడానికి అధికారికి శవపరీక్ష నివేదికను మార్చారని పిటిషన్లో ఆరోపించారు. ఫోరెన్సిక్ ఆధారాలు ధ్వంసం చేశారని, సీసీటీవీ ఫుటేజీని తారుమారు చేశారని దిశ తండ్రి ఆరోపించారు. సరైన పోస్ట్‌మార్టం విశ్లేషణ లేకుండా త్వరగా దహన సంస్కారాలు జరిగాయని పిటిషన్ ఆరోపించింది. ఇదే కాకుండా, దిశ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం టైమ్‌ని పిటిషన్లో ఎత్తిచూపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి అదే రోజు పోస్టుమార్టం నిర్వహిస్తే, దిశా పోస్టుమార్టానికి 50 గంటలకు పైగా ఆలస్యం చేశారని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ఆదిత్య ఠాక్రేని రక్షించడానికి సాక్ష్యాలు నాశనం చేసినట్లు ఆరోపించారు.
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!