All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
- అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా..
- టీఎంసీ రెబల్ ఎంపీలను ఆహ్వానించడంపై ఇండియా కూటమి అభ్యంతరం..
- కాసేపు వాకౌట్, ఆ తర్వాత సమావేశంలో పాల్గొన్న నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
All-Party Meeting: జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చింది. అయితే, ఈ సమావేశంలో హైడ్రామా చోటుచేసుకుంది. తిరుగుబాటు చేసిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఎంపీలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఆధ్వర్యంలో పార్లమెంట్ అనెక్సీ భవనంలో ఈ సమావేశం జరిగింది. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టనున్న బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. అయితే, ఈ సమావేశానికి టీఎంసీ రెబల్ ఎంపీలను కేంద్రం ఆహ్వానించింది. దీనిపై ఇండియా కూటమి పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఇండియా (NCPI) పార్టీలో విలీనమయ్యారు. వీరికి ప్రత్యేకంగా ఒక టేబుల్ కేటాయించడం వివాదాస్పదమైంది. దీనికి నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు సమావేశం నుంచి బయటకు వెళ్లారు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తిరుగుబాటు ఎంపీల కొత్త పార్టీని ఇంకా అధికారికంగా గుర్తించలేదని, అలాంటప్పుడు వారిని ఎలా సమావేశానికి ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. వాకౌట్ చేసిన పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, జేఎంఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, వామపక్ష పార్టీలు, శివసేన(యూబీటీ)లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!