వన్ నేషన్-వన్ ఎలక్షన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మద్దతు తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జమిలి ఎన్నికల తర్వాత సుపరిపాలన అందించడానికి ఒక మార్గం అని చెప్పారు. పాలనలో స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. వనరుల మళ్లింపు తగ్గించవచ్చన్నారు. అలాగే ఆర్థిక భారాన్ని కూడా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. గత 75 ఏళ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్నది రాజ్యాంగమేనని, వలసవాద ఆలోచనా విధానాన్ని మార్చేందుకు దేశం సమిష్టి ప్రయత్నాలను చూస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Padma Award 2025: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. పద్మశ్రీ వీరికే!
లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోందని చెప్పారు. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదిగిందని తెలిపారు. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలన్నారు. అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మార్చుకున్నామని… ఈ ఏడాది కొత్త చట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చామని రాష్ట్రపతి తెలిపారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela 2025 : మహాకుంభ మేళాకు ఎలా వెళ్ళాలి..? పుణ్యస్నానాల ముఖ్య తేదీలు…
#WATCH | In her address to the nation on the eve of the 76th #RepublicDay, President Droupadi Murmu says, "We got freedom in 1947, but many relics of a colonial mindset persisted among us for long. Of late, we have been witnessing concerted efforts to change that mindset. Among… pic.twitter.com/fpD0f8dtSH
— ANI (@ANI) January 25, 2025