Dharmendra Pradhan: దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దనే రాజీనామా.. ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ రియాక్షన్..
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.
- NEET-UG అవకతవకల నేపథ్యంలో నిర్ణయం.
- "ఇది వ్యక్తిగత ప్రతిష్ఠ అంశం కాదు" అని ప్రకటన.
- విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రాజీనామా చేసినట్లు వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. శనివారం ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్రమోడీకి పంపారు. యువత, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనలకు కేంద్ర మంత్రి దిగొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తన రాజీనామా లేఖలో ఆయన మాట్లాడుతూ.. గత నాలు దశాబ్ధాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణలోకి పనిచేస్తున్నామని తెలిపారు. దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చడంతో తన నైతిక బాధ్యతగా భావించినట్లు లేఖలో పేర్కొన్నారు.
2026 మే 3న నిర్వహించిన NEET-UG పరీక్షలో అవకతవకలు వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించిందని గుర్తు చేశారు. పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించడంతో పాటు వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 20 లక్షల మందికి పైగా విద్యార్థుల కో్సం తిరిగి పరీక్ష విజయవంతంగా నిర్వహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జూన్ 21నపరీక్ష విజయవంతంగా పూర్తయిందని అన్నారు.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
తాను మొదటి రోజు నుంచే బాధ్యత తీసుకున్నాని, ఎగ్జామ్ మాఫియా వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోకుండా కృషి చేశానని పేర్కొన్నారు. జూలై 16న ప్రకటించిన ఫలితాల్లో పేద, వెనకబడిన వర్గాలకు చెందిన అనేక మంది విద్యార్థులు విజయాన్ని సాధించడం సంతోషకరమని అన్నారు. ఇదే సమయంలో బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు విద్యార్థుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం తనను బాధించిందని చెప్పారు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలు కలిచివేశాయని, ఇది నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేసింది.
జంతర్ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, దేశవ్యతిరేక శక్తులు దీనిని ఉపయోగించుకోకుండా ఉండేందుకు, జాతీయ ఐక్యత కాపాడేందుకు, విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉండేందుకు, వారు చదువులపై దృష్టి సారించేలా చేయడానే ఉద్దేశంతోనే ప్రధాన మంత్రికి రాజీనామా లేఖ సమర్పించినట్లు వెల్లడించారు. తనపై నమ్మకం ఉంచిన ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రివర్గ సహచరులకు, విద్యాశాఖ అధికారులకు థాంక్స్ చెప్పారు. దేశ సేవే తన జీవిత లక్ష్యమని, భవిష్యత్తులోనూ ఒడిశా ప్రజలు, దేశ యువత కోసం సేవ చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!