దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఢిల్లీలోని రమేష్ నగర్‌లో పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. గురువారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 200 కిలోల కొకైన్‌ను పట్టుబడింది. దీని విలువ రూ. 2 వేల కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ జ్వరం, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని ఆయన అన్నారు. కొద్ది రోజుల్లోనే సీఎం ఆరోగ్యం మెరుగయ్యే ఛాన్స్ ఉందని వైద్యులు చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు.