Delhi: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ అదృశ్యం.. రంగంలోకి పోలీసులు
- ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ అదృశ్యం
- రంగంలోకి పోలీసులు.. పని చేయని సీసీకెమెరాలు
- ఆందోళనలో బాధిత కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థిని స్నేహ దేబ్నాథ్(19) అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ యూనివర్సిటీలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాలకు చెందిన విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ జూలై 7న అదృశ్యమైంది. ఆమె స్వస్థలం త్రిపుర. ఢిల్లీకి వచ్చి చదువుకుంటోంది. మాజీ సైనికుడు, సుబేదార్ మేజర్ (గౌరవ లెఫ్టినెంట్) ప్రీతిష్ దేబ్నాథ్ (రిటైర్డ్) కుమార్తె. ప్రస్తుతం ఆమె మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతోంది. డయాలసిస్ చేయించుకుంటోంది. అయితే బిడ్డ సమాచారం తెలియకపోవడంతో పేరెంట్స్ తల్లడిల్లుతున్నారు. కుమార్తె జాడ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇక 48 గంటల తర్వాత బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. అలాగే తమ బిడ్డ జాడను తెలియజేయాలని ప్రజలకు బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: Air India Crash: ఎయిర్ ఇండియా క్రాష్ రిపోర్టుపై పైలట్ల సందేహాలు..
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
జూలై 7న స్నేహితురాలిని సారాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్‌లో దించేందుకు స్నేహ వెళ్లింది. ఉదయం 6:45 గంటలకు స్నేహితురాలిని దింపబోతున్నట్లు కుటుంబ సభ్యులకు ముందుగానే సమాచారం అందించింది. ఉదయం 5:56 గంటలకు తల్లి ఫోన్ చేసినప్పుడు మాట్లాడింది. తిరిగి ఉదయం 8:45 గంటలకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ అని వచ్చింది. అయితే స్నేహ.. స్నేహితురాలిని కలవలేదని తెలుస్తోంది. క్యాబ్ డ్రైవర్.. రైల్వే స్టేషన్‌లో దింపడానికి బదులుగా సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గర దింపాడని తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉంటే బ్రిడ్జి దగ్గర సీసీ కెమెరాలు పని చేయడం లేదు. దీంతో బాధిత కుటుంబం మరింత ఆందోళనకు గురవుతోంది.
ఇది కూడా చదవండి: Shravan Masam 2025: శ్రావణ మాసంలో శివుడిని పూజించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు…
ఇక స్నేహ అదృశ్యంపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా.. ఢిల్లీ అధికారులను సంప్రదించారు. ఆమె జాడను కనుగొనాలని ఢిల్లీ పోలీసులను కోరారు. అంతేకాకుండా ఇంకోవైపు కుటుంబ సభ్యులు కూడా గాలిస్తున్నారు. ఇక ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్.. స్నేహ కోసం గాలిస్తున్నారు. అయితే ఆమె దగ్గర ఎలాంటి వస్తువులు లేనట్లుగా తెలుస్తోంది. కేవలం ఆమె దగ్గర ఫోన్ మాత్రమే ఉంది. అంతేకాకుండా 4 నెలలుగా స్నేహ ఎటువంటి నగదు కూడా తీసుకోలేదని గుర్తించారు. ఇక స్నేహ అదృశ్యమైన 48 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ బుక్ అయింది. అయితే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!