Delhi: ఆరు రోజుల క్రితం తప్పిపోయిన త్రిపురకు చెందిన చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ మృతదేహం లభ్యమైంది. 19 ఏళ్ల ఆమె డెడ్‌బాడీని దేశ రాజధానిలోని ఓ ఫ్లై ఓవర్ కింద పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. స్నేహ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే సూసైట్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థిని స్నేహ దేబ్నాథ్(19) అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ యూనివర్సిటీలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాలకు చెందిన విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ జూలై 7న అదృశ్యమైంది. ఆమె స్వస్థలం త్రిపుర. ఢిల్లీకి వచ్చి చదువుకుంటోంది.